నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంతకైనా నిలబడతా!

6 Nov, 2019 10:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రియా ! నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీకు చాలా సంవత్సరాల ముందే తెలుసు. నీకూ నాకు పరిచయం ఈ నాటిది కాదు, మన చిన్నప్పటి నుంచి ఉంది. రాష్ట్రాలు వేరైనా భాష ఒక్కటే మన మధ్య దూరం ఒక్కటే.. అది వయసు! కానీ, అది కూడా మనుషులకు మాత్రమే.. సమాజానికి మాత్రమే మనకు మన మనసుకు కాదు. నీ మనసులో నేను నా మనసులో నీవున్నావని మన ఇద్దరికీ తెలుసు. కానీ మనం ఎప్పుడూ ఆ విషయం ఒకరికొకరం చెప్పుకోలేకపోయాం. ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇది తగని పని వద్దు అనుకున్నాను. నువ్వు దూరం అయిన తర్వాత నేను బాధపడుతున్నా. ఈ మధ్య విషయం చెప్పాలని ఎంత ప్రయత్నించినా నన్ను దూరం పెడుతున్నావ్. ఎందుకని అడిగినా చెప్పనంటావు, మాట్లాడవు.

నేను ఏది చేసినా తప్పు పడుతున్నావు నువ్వు. నేను చేసిన తప్పేంటి? ఎందుకు నాపై ఇంత కోపమో ఇప్పటికీ అర్థం కాదు! చెప్పనంటావు. నేను కోరేది ఒక్కటే. నేనంటే నీకు ఇష్టం లేకున్నా పర్వాలేదు. ఎప్పట్లా నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడకపోవడమే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇది ఒకవేళ నువ్వు చదివినా కోపం తెచ్చుకోకు! నీకు నా మనసు అర్థం కావాలని, నా బాధ తెలపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. విఫలమవుతున్నా.

అందుకే ఈ దారి. ఇది మన మధ్య మరింత అగాథం పెంచుతుందని తెలుసు కానీ, ఏదో ఒక రకంగా నీ మనసులో ఉండాలని ఈ ప్రయత్నం ఎంచుకున్నా. ఇది చాలా విపత్కర పరిస్థితులు తెస్తుందని తెలుసు. కానీ నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంతకైనా నిలబడడానికి నేను సిద్ధం. అర్థం చేసుకో దేనికీ భయపడకు. ప్రేమకు ఏది అడ్డంకి కాదు. నీకు నేను నాకు నీవు. మనిద్దరికీ కనిపించని ఆ దేవుడు. మన ఇద్దరిదీ జన్మ జన్మల అనుబంధం. ఇది మనిద్దరి మధ్య ఆ దేవుడు వేసిన ముడి.. ఎవరూ విడదీయలేనిది, చివరికి ఆ దేవుడు కూడా. చాలా కష్టంగా బాధగా ఉంది. అర్థం చేసుకో బంగారం.
- బాబు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు