నాకో ట్విస్ట్ ఎదురైంది.. ఆ అమ్మాయి..

25 Nov, 2019 08:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మా అమ్మ తర్వాత నన్ను మంచిగా చూసుకోవడానికి ఓ మంచి అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నా. ఆ టైమ్‌లో సడన్‌గా ఒక రోజూ నేను మా అక్క వాళ్ల కూతురు పెళ్లికి వెళ్లాను. ఆ పెళ్లిలో ఒక అమ్మాయిని చూశాను. అంతే! ఆమె వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోయాను. అప్పుడు నేను 10 తరగతి, నా ఏజ్ 16.. అమ్మాయి 9 తరగతి. చిన్న వయసులోనే మా ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయింది. కాకపోతే అప్పుడే నాకు ఒక ట్విస్ట్ ఎదురైంది. ఆ అమ్మాయి ఎవరో కాదు! మా బాబాయి వాళ్ల కూతురుకి కూతురు. అంటే ఆ అమ్మాయికి నేను మామయ్యను అవుతా అని తెలిసింది. ఇక అప్పటినుంచి మా మధ్య ప్రేమ కొంచెం బలంగా అయింది. అమ్మాయి వాళ్ల అమ్మ నాకు అక్క అవుతుంది. ఒకరోజు నేను అమ్మాయి వాళ్ల ఊరు వెళ్లాను. మా అమ్మ వాళ్లు ఒకసారి నన్ను ఆ అమ్మాయిని తీసుకురమ్మని పంపించారు. సరే వాళ్ల అమ్మ కూడా రమ్మని చెప్పింది.

నేను వాళ్ల ఊరు వెళ్లి తనను మా ఇంటికి తీసుకుని వచ్చాను. ఫస్ట్ రోజూ తను ‘మామయ్య డాబా పైకిరా’ అని పిలిచింది. అప్పుడు మా నాన్న పక్కనే ఉన్నాడు. పిలుస్తుంది కదా అని డాబా పైకి వెళ్లాను. ‘మామయ్య నీతో ఒకటి చెప్పాలి’ అని అంది. ‘ఏంటి చెప్పు’ అన్నాను. ‘మామయ్య నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్‌ యూ సో మచ్‌. నన్ను ఎప్పుడూ హ్యాపీగా చూసుకుంటావా?’ అని అడిగింది. నాకు అలా చెప్పడం బాగా నచ్చింది. అమ్మాయి నచ్చింది.. సరే అని తనకు మాట ఇచ్చాను. తరవాత మా లవ్ కంటిన్యూ అవుతూ 4 ఏళ్లు గడిచింది. వచ్చే ఏడాదిలో మాకు పెళ్లి చేయడానికి మా ఇంట్లో తన ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.
- అంజి, అచ్చంపేట

చదవండి : నిద్రరాదు, ఆకలివేయదు! ఒకరకమైన పిచ్చి
నేను బ్రతికి ఉండటం చూసి షాక్‌ అయ్యింది



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు