నా బ్యాడ్‌లక్‌ ఫేర్‌వెల్‌ క్యాన్సిల్‌ అయ్యింది

25 Oct, 2019 16:29 IST|Sakshi

మొదటిసారి నేను లిఖితను స్కూల్‌ సైకిల్‌ పార్కింగ్‌ వద్ద చూశా. చూడగానే బాగా నచ్చింది! పెళ్లిచేసుకుంటే తనను తప్ప వేరే వాళ్లను చేసుకోకూడదు అనుకున్నా. డైలీ తన ఇంటివరకు ఫాలో అయ్యేవాడిని. తను చూసేది కానీ, మా మధ్య మాటలు మాత్రం లేవు. అలా చాలా కాలం గడిచిపోయింది. నాకు తనతో మాట్లాడాలంటే భయంగా అనిపించేది. సెప్టెంబర్‌ 21న లిఖిత పుట్టిన రోజు. ఆ రోజు తను స్కూల్‌కు వైట్‌ కలర్‌ చుడిదార్‌ వేసుకుని వచ్చింది. ఫ్రెండ్స్‌ అందరూ ‘నీ బర్త్‌డే రా’ అని అనే వారు. రాత్రి 8 గంటలకు ఆమెను విష్‌ చేద్దామని చాక్లెట్‌ తీసుకుని వెళ్లాము. తనకు అర్థమైంది! నేను తనను విష్‌ చేయటానికి వచ్చానని. కానీ, నేను విష్‌ చేయలేకపోయా.

ఎక్కడో తను నన్ను కూడా ఇష్టపడుతోంది అని అర్థమైంది. కానీ, మాట్లాడాలంటే భయం. మా నాన్నమ్మ చెప్పింది‘ మనం పడుకునేటప్పుడు ఏది గుర్తుకు తెచ్చుకుంటామో కల్లోకి అదే వస్తుంది’ అని. నేను డైలీ లిఖితను గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని. ఆ కాలాలు ఎంత మధురంగా ఉండేవో.. మా స్వచ్ఛమైన ప్రేమకు తీపి గుర్తులు. చూస్తుండగానే మా పదవ తరగతి పరీక్షలు వచ్చేశాయి. నేను ఎలాగైనా ఫేర్‌వెల్‌ రోజు ప్రపోజ్‌ చేద్దామని అనుకున్నా. కానీ, నా బ్యాడ్‌లక్‌ ఫేర్‌వెల్‌ క్యాన్సిల్‌ అయ్యింది. మనసు చెరిగిపోని జ్ఞాపకాలతో భారంగా అనిపించింది. పదవ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఇద్దరికీ మంచి మార్కులు  వచ్చాయి. తను ఏ కాలేజ్‌లో జాయిన్‌ అవుతుందో అదే కాలేజ్‌లో జాయిన్‌ అవుదామని అనుకున్నా కానీ, తన గురించి ఎలా తెలుస్తుంది??.

ఓ రోజు సాయంత్రం స్నేహితులతో కలిసి నెట్‌ షాప్‌కు వెళ్లా పాలిటెక్నిక్‌ ఎక్షామ్‌కు అప్లై చేద్దామని. అనుకోకుండా లిఖిత వాళ్ల అన్నయ్య, తను ఇద్దరూ అక్కడికి స్కూటీ మీద వచ్చారు. నేను వాళ్లను చూడలేదు. అపుడు వెనకనుంచి హరీష్‌ అని పిలిచారు! నేను ఎవరో అనుకుని వెనక్కు చూశా.. లిఖిత మళ్లీ పిలిచింది. నాకు మాటలు రావట్లేదు. తను కంగ్రాట్స్‌లేషన్‌ చెప్పి వెళ్లిపోయింది. అది ఎప్పటికీ నా కళ్లల్లో ఉంటూనే ఉంది. ఇది జరిగి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతోంది. తను ఇప్పుడు ఏం చేస్తుందో.. ఎక్కడ ఉందో ఏమో తెలియదు. ఐ లవ్‌ యూ లిఖిత ... ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటా. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరకుంటున్నా.
- హరీష్‌ (పేర్లు మార్చాం)


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు