ఆమెకు పెళ్లైందని తెలిసి చనిపోవాలనుకున్నా..

10 Nov, 2019 16:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నా పేరు వెంకటేష్‌! మాది వైజాగ్‌. నాకు బీటెక్‌ సీట్‌ శ్రీకాకుళంలో వచ్చింది. నేను బీటెక్‌ జాయిన్‌ అవుతున్నపుడే నాతో పాటు ఓ అమ్మాయి కూడా జాయిన్‌ అయ్యింది. మొదట్లో మేమిద్దరం క్లాస్‌మేట్స్‌ లానే ఉండేవాళ్లం. ఒక సంవత్సరం తర్వాత మా మధ్య స్నేహం ఏర్పడింది. మూడేళ్లు ఎంతో స్నేహంగా ఉన్నాం. కానీ, అప్పుడు తెలియదు అది స్నేహం కాదు ప్రేమ అని. బీటెక్‌ అయిపోయే లాస్ట్‌ రోజు తను నన్ను వదిలి వెళుతుంటే తట్టుకోలేకపోయాను. తర్వాత రోజు నేను వైజాగ్‌ వెళ్లిపోతున్నానని చెప్పటానికి తన హాస్టల్‌కు వెళ్లాను. అప్పుడు తను నన్ను చూసి హగ్‌ చేసుకుంది.

ఆ క్షణం తెలిసింది తను నన్ను ప్రేమిస్తోందని. తర్వాత నేను వైజాగ్‌ వచ్చి మా పేరెంట్స్‌తో పెళ్లికి ఒప్పించాను. మా పేరెంట్స్‌ ‘ముందు నువ్వు జాబ్‌లో జాయిన్‌ అవ్వు. తర్వాత మేము వెళ్లి వాళ్ల వాళ్లతో మాట్లాడతాం’ అన్నారు. నేను జాబ్‌ గురించి బెంగళూరు వెళ్లాను. నేను జాబ్‌లో జాయిన్‌ అయిన ఒక నెల తర్వాత నాకో కాల్‌ వచ్చింది. అది తననుంచి.. వాళ్ల ఫాదర్‌ చనిపోయాడని. రెండు వారాల తర్వాత నేను వాళ్ల ఊరు వెళ్లాను. అప్పుడు వాళ్ల మదర్‌ ఒకమాట చెప్పింది. తనకు వాళ్ల బావతో పెళ్లిచేయటం తన తండ్రి చివరి కోరికని. ఆ మ్యారేజ్‌కు తనుకూడా ఒప్పుకుంది. నేను వెంటనే అక్కడినుంచి వచ్చేశాను.

తనను మరిచిపోలేక మందుకు బానిసయ్యాను, జాబ్‌ పోగొట్టుకున్నాను. ఐదు నెలల తర్వాత తనకు వాళ్ల బావతో మ్యారేజ్‌ అయిపోయిందని తెలిసి నేను చనిపోవాలనుకున్నాను. అప్పుడే మా ఫాదర్‌కు హెల్త్‌ బాగోలేక ఇంట్లో పరిస్థితులు బాగోలేక మా ఫ్యామిలీ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అప్పుడు నేను మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అయ్యాను. తనను మర్చిపోయి ఫ్యామిలీని చూసుకుంటున్నాను.
- వెంకటేష్‌, వైజాగ్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!

వారంలో పెళ్లి... అంతలోనే!

ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!

బిజినెస్‌లో నష్టం వచ్చింది...అప్పుడు తను!

నేను దుబాయ్‌కు వెళ్లే రెండు రోజుల ముందు!