నా జీవితంలో అతడికి తప్ప ఎవరికీ చోటు లేదు

8 Nov, 2019 14:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నాకు చిన్నప్పటినుంచి లవ్‌ అంటే ఇష్టం లేదు! ప్రేమ పెళ్లిళ్లపైనా నమ్మకం లేదు. ఎందుకంటే లవ్‌ చేస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న నిబంధనలు ఎక్కువవుతాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అలోచించేదాన్ని. అలాంటి టైమ్‌లో నా లైఫ్‌లోకి ఒక అబ్బాయి వచ్చాడు. నాకు చాలా క్లోజ్‌ అయ్యాడు. నేను అతన్ని బెస్ట్‌ ఫ్రెండ్‌లాగా ట్రీట్‌ చేశా. నాకు యాక్సిడెంట్‌ అయినపుడు ఆ అబ్బాయి నా మీద ఎక్కువ కేర్‌ తీసుకునేవాడు. నా గురించి ఎందుకు అంత బాధో అర్థం అయ్యేది కాదు. ఆ తర్వాత మేమిద్దరం చాలా క్లోజ్‌ అయ్యాం. అతనితో మాట్లాడకుండా ఒకరోజు కూడా ఉండలేనంతగా. అయితే నేను భయపడుతున్న రోజు రానే వచ్చింది. తను నాకు ప్రపోజ్‌ చేశాడు.

నేను ఒప్పుకోలేదు. అతడ్ని కట్‌ చేయలేకపోయా. మంచి ఫ్రెండ్‌ని వదులుకోలేకపోయా. తనకు జాబ్‌ వచ్చి ఢిల్లీకి వెళ్లిపోయాడు. అయినా నాతో రోజూ టచ్‌లో ఉండేవాడు. అతడు ఇంటికి వచ్చిన ప్రతిసారి తప్పకుండా నన్ను మీట్ అయ్యే వెళతాడు. అలా ఒక 3 ఏళ్లకు ఆ అబ్బాయి అంటే ఇష్టపడ్డాను. నేను తనని ఇష్టపడుతున్నానని చెప్పలేదు. ఎందుకంటే నాకు ఇంట్లో చెప్పేంత ధైర్యం లేదు. అతను నాతో మాట్లాడుతుండటం వల్ల మిస్‌ అవుతున్నాననే భావన కలగలేదు. ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. పెళ్లి అంతలోనే సెట్‌ అవ్వదుగా మా ఇంట్లో ఒప్పించొచ్చు అనుకున్నా.

అతనికి వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిపోయింది. ఆ విషయం చాలా లేట్‌గా తెలిసింది! అంతలోపే అతడి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోయింది. నేననుకున్నది అతనికి చెప్పలేదు. తన పెళ్లి అయ్యాక నన్ను ఆమెకు పరిచయం చేశాడు. నేను తన పక్కన లేను అని బాధపడ్డా ఆ క్షణం. అతనికి పెళ్లి అయిపోయిన ఒక సంవత్సరానికే అమ్మాయి పుట్టింది. తను నన్ను పూర్తిగా మర్చిపోలేదు. నేను తనని ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటా. నేను ఎవరిని పెళ్లి చేసుకోను.. నా జీవితంలో అతడికి తప్ప ఎవరికీ చోటు లేదు.
- ప్రీతి

లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు