కెనడా రానన్నాను. దూరం పెరిగింది కానీ..

2 Nov, 2019 18:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హాయ్‌.. నా పేరు మహ్మద్‌ రిజ్వాన్‌. రెండేళ్ల క్రితం మా పెళ్లయ్యింది. మాది ప్రేమ వివాహాం. కోచింగ్‌ సెంటర్లో పరిచయం అయ్యింది తను. మొదట్లో మా ఇద్దరి మధ్య చాలా చాలా గొడవలు జరిగేవి. కానీ విరుద్ద ధృవాలకు ఆకర్షణ ఎక్కువ అన్నట్లు.. మా మనసులు కలిశాయి. ఇద్దరం పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. అందరి పేరేంట్స్‌ లాగే మా పేరేంట్స్‌ కూడా మొదట్లో మా పెళ్లికి ససేమిరా అన్నారు. కానీ 14 నెలల తర్వాత మా పెళ్లికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక నా కష్టాలు మొదలయ్యాయి. దాదాపు 50 ఇంటర్వ్యూలకి వెళ్లాను. ఒక్కదాంట్లోనూ జాబ్‌ రాలేదు. రకరకాల టెన్షన్లు చుట్టుముట్టాయి. ఆరోగ్యం అ‍స్సలు సహకరించేది కాదు. డాక్టర్‌ను సంప్రదించాను. అప్పుడు తెలిసింది నేను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని.

జీవితంలో చీకట్లు కమ్ముకున్నట్లు అనిపించింది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత నేను కోలుకున్నాను. మళ్లీ నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నా. ఉద్యోగం సంపాదించాలని టెక్నికల్‌ స్కిల్స్‌ మెరుగుపరుచుకోవడానికి ఓ కోచింగ్‌ సెంటర్లో జాయిన్‌ అయ్యాను. అప్పుడే తనతో నా ప్రేమ ప్రయాణం మొదలైంది.  ఆనతికాలంలోనే ముద్దుపేర్లతో పిల్చుకునేంత క్లోజ్‌ అయ్యాం.  మా మనసులు కలిశాయి. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నాం. నా ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని తనతో పంచుకున్నా. తనని డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లి ఏవైనా సందేహాలుంటే తెలుసుకోమని చెప్పాను. నా హెల్త్‌ కండీషన్‌ స్టేబుల్‌గానే ఉందని డాక్టర్‌ చెప్పారు. అన్నీ మనకు అనుకూలంగానే ఉందనుకున్న టైంలో మా పెళ్లికి పెద్దలు మొదట్లో ఒప్పుకోలేదు. కానీ మా ప్రేమ నిజాయితీని గుర్తించి సంవత్సరం తర్వాత ఒప్పుకున్నారు. గాల్లో తేలినట్లుందే అని ఓ సాంగ్‌ పాడుకున్నా.

తను వచ్చాక నా జీవితం మరింత అందంగా మారిందనిపించింది. అయితే అందరి జీవితంలో ఉన్నట్లే మా లైఫ్‌లో కూడా కలహాలు మొదలయ్యాయి. ప్రేమలో ఉన్న హ్యాపీడేస్‌ పెళ్లి అయ్యాక తగ్గాయి అనిపించేలా మా మధ్య గొడవలు పెరిగాయి. దూరం పెరిగింది. కారణం.. కెనడా వెళ్లి ఉన్నత చదువులు చదివి ఇద్దరం అక్కడే సెటిల్‌ అవ్వాలన్నది తన ఆలోచన. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. దీనికి తోడు నా ఆరోగ్యం కూడా ఇప్పుడు సరిగ్గా లేదు. ఈ పరిస్థితుల్లో నాకు కెనడా వెళ్లాలని లేదు. ఈ విషయంపై తనను ఎన్నిసార్లు కన్‌విన్స్‌ చేసినా వినడం లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇప్పటికీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ. 
-  మహ్మద్‌ రిజ్వాన్‌, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు