ప్రియురాలి కోసం పేపర్‌ యాడ్‌.. చివరకు..

17 Oct, 2019 16:52 IST|Sakshi
మాట్రినెజ్‌ ఇచ్చిన పేపర్‌ యాడ్‌

టెక్సాస్‌ : మాట్రినెజ్‌ మనసుమనసులో లేదు! ఆమె గుర్తుకు వచ్చినపుడల్లా ఏదో తెలియని బాధ. ఆమెతో కలిసి తిరిగిన క్షణాలు గుర్తొచ్చిన ప్రతిసారి ఓ వైపు ఆనందం మరోవైపు దుఃఖం కలుగుతోందతనికి. తనతో కలిసున్నది కొన్ని గంటలైనా అవి మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆమెను ఎలాగైనా ఇంకోసారి కలవాలి అనుకున్నాడు. కానీ, ఎలా?.. ఆమె పేరు, ఊరు ఏదీ తెలియదు. పర్యటన కోసం హార్ట్‌ ఐలాండ్‌ వెళ్లినపుడు తను పరిచయమైంది. కొన్ని గంటల పాటు అక్కడి ప్రాంతాలను కలిసి చూశారు. ఒకరి ఫొటోలు ఒకరు తీసుకున్నారు. ఆమె ‘‘సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌’’ అతడని బాగా ఆకట్టుకుంది. ఆమెతో ఉన్నంత సేపు తను జోకులు వేస్తుంటే మాట్రినెజ్‌ పగలబడి నవ్వటం మామూలైపోయింది.

మాటల్లో పడి ఒకరి వివరాలు ఒకరు తెలుసుకోవటం కూడా మర్చిపోయారు. ఫోన్‌ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకోలేదు. అక్కడ పర్యటన ముగిసి, ఇద్దరు బస్సులోకి తిరిగి వచ్చి వేరువేరుగా కూర్చోవటంతో మాట్లాడుకునేందుకు అవకాశం రాలేదు. మాట్రినెజ్‌ మాత్రం ఆమెను అక్కడికి దగ్గరలో ఉన్న సెంట్రల్ ఐలాండ్‌లో చూడొచ్చని అనుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు తనను మళ్లీ కలుసుకునే అవకాశం అతడికి రాలేదు. ఇంటికి తిరిగొచ్చిన క్షణంనుంచి ఆమె జ్ఞాపకాలు అతడ్ని వేధించసాగాయి. అప్పుడర్థమైందతడికి.. ఆమెను తను ప్రేమిస్తున్నాడని.

పర్యటన సందర్భంగా మాట్రినెజ్‌ దిగిన ఫొటో
కొన్ని రోజులు తీవ్రంగా ఆలోచించాడు. పేరు, ఊరు, అసలు ఏమీ తెలియని అమ్మాయిని కనుక్కోవటం ఓ సవాల్‌గా మారింది. మనసుంటే మార్గముంటదన్నట్లు అప్పుడే అతడికి పేపర్‌ యాడ్‌ ఆలోచన వచ్చింది. అంతే ఆమె కోసం గత జులై 16న ఓ పేపర్‌లో చిన్న యాడ్‌ వేయించాడు. ఆ యాడ్‌ కొన్ని గంటల్లోనే అమెరికా వ్యాప్తంగా వైరల్‌గా మారిపోయింది. ఎట్టకేలకు మాట్రినెజ్‌ వెతుకుతున్న అమ్మాయి ఆ యాడ్‌ను చూసి అతన్ని సంప్రదించింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నెలలో మాట్రినెజ్‌ ఆ అమ్మాయి కలిసి మరోసారి హార్ట్‌ ఐలాండ్‌కు వెళ్లబోతున్నారు. అక్కడ కలిసి డిన్నర్‌ కూడా చేయబోతున్నారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు