ప్రేమకు మతం ఎన్నడూ అడ్డు కాదు!

9 Nov, 2019 12:05 IST|Sakshi
తిరుమనమ్‌ ఇన్నుమ్‌ నిఖా సినిమాలోని ఓ దృశ్యం

లవ్‌ సినిమా

సినిమా : తిరుమనమ్‌ ఇన్నుమ్‌ నిఖా
తారాగణం : జై, నజ్రియా నజీమ్‌ 
డైరక్టర్‌ : అనిస్‌ 
భాష : తమిళం

కథ : విజయ్‌ రాఘవన్‌ చారి(జై) విష్ణు ప్రియ( నజ్రియా నజీమ్‌) చెన్నై నుంచి కోయంబత్తూర్‌ వెళుతున్న సమయంలో రైలులో కలుసుకుంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మారు పేర్లు అబుబకర్‌, అయేషాలుగా ఒకరికొకరు పరిచయమవుతారు. తొలిచూపులోనే రఘు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత చోటుచేసుకునే ఓ సంఘటన వల్ల ప్రియకు, రఘు మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆమె కూడా అతడిని ఇష్టపడటం మొదలుపెడుతుంది. చెన్నై తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యా బంధం బలపడుతుంది. అబు బకర్‌  అలియాస్‌ రఘు ముస్లిం వ్యక్తి కాబట్టి అతడికి తగ్గట్టుగా మారుతుంటుంది ప్రియ. అలాగే అయేషా అలియాస్‌ ప్రియ ముస్లిం కాబట్టి ఆమెకు తగ్గట్టుగా మారుతుంటాడు రఘు.

ఇందుకోసం ముస్లిం మతానికి చెందిన ఓ పెద్దమనిషి ఇంట్లో వారి ఆచార వ్యవహారాలు నేర్చుకుంటుంటాడు. ఈ సమయంలోనే ఆ పెద్ద మనిషి కూతురు నషీమా( హెబ్బా పటేల్‌) రఘుతో ప్రేమలో పడుతుంది. అతడు కూడా తనని ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది. ఆ తర్వాత జరిగే ఓ సంఘటనతో రఘు, ప్రియలకు ఒకరిగురించి ఒకరికి నిజం తెలిసిపోతుంది. పెళ్లికూడా నిశ్చయం అయిపోతుంది. అయితే తాము ప్రేమించుకుంది రఘు, ప్రియలుగా కాదని వారు భావిస్తారు. అబు బకర్‌, అయేషాల మధ్యే నిజమైన ప్రేమ ఉందని జరిగే పెళ్లిని ఆపుచేసుకుంటారు. రఘు, ప్రియల పెళ్లి విషయం తెలిసి నషీమా ఏం చేస్తుంది? రఘు, ప్రియలు మళ్లీ కలుసుకుంటారా? లేదా? అన్నదే మిగితా కథ.

విళ్లేషణ :  2014లో విడుదలైన ఈ సినిమా ఫుల్‌ లెన్త్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. ఒకరికొకరు వేరువేరు మతాల వ్యక్తులుగా పరిచయం కావటం, ప్రేమలో పడటం, ప్రేమను దక్కించుకోవటానికి వారుపడే కష్టాలు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమకు మతం ఎన్నడూ అడ్డు కాదని చెప్పే ఫీల్‌ గుడ్‌ మూవీ. ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు