మీరు ఇంట్రావర్ట్‌లా? ఇది మీకోసమే.. 

11 Nov, 2019 12:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇతరులతో ఎక్కువగా కలవకుండా, తమ భావాలను బయటకు ఎక్కువగా వ్యక్తపరచకుండా తమలో తాము గడిపే వ్యక్తులను ఇంట్రావర్ట్‌లు( అంతర్ముఖులు) అంటారు. వీరు ఎక్కువగా జనాలతో గడపటానికి ఇష్టపడరు. వీలైనంత ఒంటరిగా ఉంటూ తమ పనుల్ని చేసుకుపోతుంటారు. అవసరం ఉంటే తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్లాలన్నా పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఒకవేళ అక్కడకు వెళ్లినా వారితో పెద్దగా కలవరు. ఎప్పుడెప్పుడు అక్కడినుంచి బయటపడాలా అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారు ఎవరినన్నా ప్రేమించాలన్నా, ఎవరితోనైనా ప్రేమించబడాలన్నా చాలా కష్టం. ఎవరైనా వీరిని ఇష్టపడితే వారికి వీరు అర్థంకాక, అర్థం చేసుకునే తీరిక లేక మధ్యలోనే ప్రేమను చుట్టచుట్టి పక్కన పడేస్తారు.

తమ ప్రేమను బయటకు వ్యక్త పరచలేక చాలా మంది ఇంట్రావర్ట్‌లు  సతమతమవుతుంటారు. అంతేకాకుండా తమను ప్రేమించే వారు లేరనే బాధతో డిప్రెషన్‌కు గురవుతుంటారు. ఇలాంటి వారు కచ్చితంగా తమ చేష్టలలో మార్పులు చేసుకుని తీరాల్సిందే. మొత్తంగా కాకపోయినా కొద్దిగానైనా మార్పు చెందితే తగిన జోడీ తప్పక దొరుకుతుంది. ముందుగా మన బలాలను, బలహీనతలను తెలుసుకోవాలి. మెల్లమెల్లగా వాటిపై ఆదిపత్యాన్ని సాధించాలి. మనం ఇంట్లో కూర్చుంటే మనల్ని వెతుక్కుంటూ ఎవరూ రారు. కాబట్టి ముహమాటాన్ని పక్కన పెట్టి కొద్దిగా బయట తిరగటం అలవాటు చేసుకోవాలి.

పెళ్లిళ్లకు, పార్టీలకు, ఇతర ఫంక్షన్లకు వెళుతుండాలి. కొత్తలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ, సంయమనంతో ఉండంది. ఇక అక్కడ ఉండలేమని కచ్చితంగా అనిపించినపుడు ఇంటికి వచ్చేయటం మంచిది. ఇక బయటకు వెళ్లినపుడు ఎదుటి వ్యక్తులను గమనిస్తూ మనకెలాంటి వారు కావాలో తెలుసుకోవాలి. మన స‍్వభావానికి తగ్గట్టు ఇంట్రావర్ట్‌ల లేక ఎక్స్‌ట్రా వర్ట్‌ల, రెండు తత్వాలు కలిసిన వ్యక్తులా అన్నది నిర్ణయించుకోవాలి. ఇక ఏం చేసినా బయటకు వెళ్లలేము అనుకుంటే అలాంటప్పుడు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌, సైట్లలను నమ్ముకోండి. అక్కడ మీ భావాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. ఆవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ బంధాన్ని ముందుకు నడిపించండి.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు