పర్లేదు మేడమ్! ఒప్పుకునే వరకు ఎదురుచూస్తా..

12 Oct, 2019 10:56 IST|Sakshi

తను మా బంధువుల అమ్మాయే.. అయినా తనని అంతవరకు ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు. నాకు సరిగ్గా డేట్‌ తెలియదు! వాళ్ల అక్క పెళ్లికి ముహూర్తాలు అనుకుంటా.. వెళ్ళాను. అప్పుడే చూశాను తనని. ఎందుకో తెలీదు చూడగానే నాకు నచ్చేసింది ?? అయినా ఏం మాట్లాడలేదు. తరువాత పెళ్లికి కూడా వెళ్ళాను. పెళ్లిలో అనుకుంటా చూసి ఒక సారి మర్యాదగా నవ్వింది. అప్పుడు కూడా మాట్లాడుకోలేదు మేము. పెళ్లి అయి పోయింది. తరువాత ఇంక తనను చూసే అవకాశమే రాలేదు నాకు. అందరి లాగే నేను తన గురించి అలోచించడమే నా పనిగా అయిపోయింది. ఫేస్‌బుక్‌లో ఉంటుందని తన పేరు వెతికి చూశాను. తను కనిపించింది. ఇంకేముంది ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టేసాను. తను ఆక్సెప్ట్‌ చేసింది. ఇక అప్పటినుంచి ప్రతిరోజు చాటింగ్‌. అప్పుడు తను బెంగళూరులో ఉంది కోచింగ్‌ తీసుకుంటూ. రోజూ మాట్లాడుకునే వాళ్లం. అసలు చెప్తే నమ్మరు కానీ, రోజు తెలియకుండానే గడిచిపోయేది. అలా తన ఇష్టాలు.. తన గురించి చాలా చెప్పింది. నేను కూడా చాలానే చెప్పాను అనుకోండి.

అంతే ఒక రోజు నాకు తెలిసిన భాషలో వచ్చీరానట్టుగా వాట్సాప్‌లో ప్రేమ లేఖ రాశాను. తన నుండి స్పందన లేదు. 2 రోజుల తరువాత మెసెజ్‌ చేసింది. ఏంటి ఇది షాక్‌ ఇచ్చావ్‌ నాకు అంది. తను నా ప్రపోజల్‌కు ఏం రిప్లై యివ్వలేదు . అయినా నాతో రోజూ మాట్లాడేది. నేను రోజూ ఐ లవ్‌యూ చెప్పేవాడిని. తను ఆ ఒక్క మాటకు తప్ప మిగిలిన అన్నింటికి స్పందించేది. ఒక రోజు తనకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బెంగళూరులోనే. ఆ విషయం తనే నాకు ఫోన్‌ చేసి చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది తను నాకు కాల్ చేసి చెప్పేసరికి. ఒక రోజు సడెన్‌గా బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు చేరుకున్న తర్వాత తనకు ఫోన్‌ చేశాను ‘‘ నేను బెంగళూరు వచ్చాను. నిన్ను చూడాలని. తను.. నేను కలవను! నిన్ను ఎవరు రమ్మన్నారు’’ అని తిట్టింది. నాకు బెంగళూరులో ఏం తేలీదు! అదే మొదటిసారి బెంగళూరు రావడం . నాకు ఇంగ్లీష్‌ కూడా రాదు. నేను పెద్దగా చదువుకోలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంకేం చేస్తాం! ఇంటికి రావడానికి బస్‌ ఎక్కాను. బస్ తిరుమలకి వచ్చిన తరువాత తను ఫోన్‌ చేసింది‘‘ నేను ఇంటికి వస్తున్నాను.

ఇద్దరం కలిసి వెళ్దాం’’  అని. అంతే! షాక్‌ అయ్యాను నేను. టైమ్‌ చూస్తే రాత్రి ఎనిమిది.. తిరుపతికి వచ్చేశాను. ఆం విషయం తనకు చెప్పలేదు. జర్నీ చేసే ఓపిక లేదు నాకు. అయినా తనని చూడాలి. తిరుపతిలో ఇద్దరికీ బస్‌ టెక్కెట్లు బుక్‌ చేశాను. అక్కడే రూం కూడా బుక్‌ చేసుకున్నాను. రాత్రి తిరుపతిలోనే ఉన్నాను. నిద్ర అసలు రాలేదు! తనతో మొదటిసారి కలిసి ప్రయాణించబోతున్నందుకు. ఉదయం 6 గంటలకు బెంగళూరుకు బస్‌ బయలుదేరింది. మద్యాహ్నం 12 : 30కు బెంగళూరు చేరుకుంది. తిరిగి రావల్సింది మాత్రం రాత్రి 11కు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. రోడ్డుపైనే ఒక చెట్టు కింద. కూర్చుని 11 వరకు ఉన్నాను. తనకా విషయం చెప్పలేదు. ఇదంతా నాకు ఏం బాధ అనిపించలేదు. తనతో జర్నీ చేస్తున్నా కదా! తను బస్‌స్టాప్‌కు వచ్చింది. 11 గంటలకు బస్‌ బయలుదేరింది. తన పక్కనే కూర్చున్నాను. తను విండో సీట్‌లో కూర్చుంది. తను ఏం మాట్లాడటం లేదు. నేను ఏం మాట్లాడటం లేదు. టైం రాత్రి 12..  ఉదయం దీపావళి. తను పక్కనే ఉన్నా కూడా వాట్సాప్‌లోనే విష్‌ చేశా.  

తను కూడా అలానే విష్‌ చేసింది. కొంచెం ఓవర్‌గా అనిపించినా ఆ రాత్రి చాలా సేపు తననే చూస్తున్నాను.. తను నిద్రపోతున్నప్పుడు లెండి! తనతో జర్నీ చేస్తున్నాననే కానీ, ఏం.. సంతోషం లేదు. తను ఏం మాట్లాడటం లేదు. నేను కూడా అంతే అలా మార్నింగ్‌ అయింది. నెల్లూరు వచ్చింది. తను ముందే బస్ దిగింది. బస్ దిగెప్పుడు షేక్‌ హ్యాండ్‌ యిచ్చి ‘‘ హ్యాపీ దివాలి’’ అని చెప్పింది. అంతే ఒక్క సారిగా హ్యాపీ. ‘‘నేను వెళ్తున్నాను. నా వెనకే రాకు’’ అని చెప్పి బస్ దిగి వెళ్ళిపోయింది. ప్రతి రోజు చెప్పటం నాకు.. లవ్‌ లాంటివి ఇష్టం లేదని చెప్పడం తనకు అలవాటైపోయింది. ఇప్పటికి 2 ఏళ్లు అయ్యింది ప్రపోజ్‌ చేసి. తన నుంచి ఐ లవ్‌ యూ టూ అని మాత్రం రావడం లేదు. ప్రతి రోజు నాతో మాట్లాడుతుంది, ఫోన్‌ చేస్తుంది. కానీ, ప్రపోజల్‌ మాత్రం ఒప్పుకోవడం లేదు. పర్లేదు మేడమ్‌ నువ్వు ఒప్పుకునే వరకు ఎదురు చూస్తుంటాను. ఐ లవ్‌ యూ మేడమ్‌.
- ఉప్పల శివ, నెల్లూరు 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు