నువ్వు మంచిదానివి నేను నీకు వద్దు!

28 Jan, 2020 19:19 IST|Sakshi

నువ్వు చాలా మంచి అమ్మాయివి నేను నీకు వద్దు అని వదిలేసి వెళ్లిపోయాడు. నేను స్కూల్‌ డేస్‌ నుంచి చాలా సైలెంట్‌గా ఉంటూ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఇంటర్‌ కూడా వైజాగ్‌లో గార్ల్స్‌ హాస్టల్‌లో ఉండే చదువుకున్నాను. డిగ్రీలో చేరాక సగంలో తను పరిచయం అయ్యాడు. తను ఒక షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌. నేనే ముందు తనకి మెసేజ్‌ చేశాను. మేం చాలా మాట్లాడుకునేవాళ్లం. తను నాకు నీతో రిలేషన్‌షిప్‌ కావాలి అని అడిగాడు. నేను సరే అన్నాను.

అలా నాకు తెలియకుండా నేను తనని చాలా ప్రేమించాను. చాలా సార్లు చెప్పాలనుకున్నాను. కానీ తను ఏమనుకుంటాడో అని భయమేసి చెప్పలేదు. కానీ తనంటే నాకు ఇష్టం అని తనకి తెలుసు కావాలనే నన్ను దూరం పెట్టాడు. తను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనుకునే దాన్ని. ఈ విషయాలు అన్ని తెలిసి కూడా నేను తనని ప్రేమించాను. తను నన్ను లవ్‌ చేయకపోయిన పర్వాలేదు నాతో మాట్లాడితే చాలు అని అనుకునేదాన్ని. కానీ తను నాతో మాట్లాడటం మానేశాడు. తన కోసం ఏడవని రోజు లేదు. ప్రతి రోజు తన ఫోటోస్‌ చూసుకుంటూ, పాత మెసేజ్‌లను చదువుకుంటూ బతికేస్తున్నాను. తనంటే అంత పిచ్చి నాకు. ఈ జన్మలో కాకపోయిన వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు ప్రేమించే అమ్మాయిని నేనే కావాలనుకుంటున్నాను. నా జీవితంలో నిన్ను ఎప్పటికీ మర్చిపోను. 
గీత(విశాఖపట్నం).

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు