ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!

31 Jan, 2020 15:18 IST|Sakshi

మేషం :  మీరు అభిమానించే వారికి ప్రేమసందేశాలు అందించేందుకు ఆది, బుధవారాలు దివ్యమైన కాలమని చెప్పాలి. ఈ సమయంలో మీరు అభిమానించే వారి నుంచి సైతం సానుకూల సందేశాలు రావచ్చు.
ఈరోజుల్లో పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. ఇక శుక్ర, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. 

వృషభం :  మీ ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, బుధవారాలు అత్యంత అనుకూలం. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలివారి నుంచి అనుకూల సందేశాలు అందవచ్చు. ఇక ఈరోజుల్లో మీరు వైట్, గ్రీన్‌
రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే సానుకూలత ఉంటుంది. ఇక ఆది, సోమవారాలు మౌనం మంచిది.

మిథునం : మీరు ఇష్టపడే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శని, గురువారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీపట్ల అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేయవచ్చు. ప్రతిపాదనల
సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే ఉత్తమం. అలాగే, ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక ఆది, సోమవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

కర్కాటకం: మీ మనస్సులో ఉన్న వారికి సందేశాలు అందించేందుకు ఆది, మంగళవారాలు అత్యంత అనుకూలం. ఈరోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి ప్రతిపాదనలు
చేసే వారు వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది.  ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, శనివారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

సింహం: మీ అభిప్రాయాలను ఇష్టులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీరు ఇష్టపడే వారు మరింత సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ఇటువంటి
సమయంలో మీరు ఆరెంజ్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఉత్తర ఈశాన్య దిశగా ఇంటి నుంచి బయలుదేరండి, శుభాలు కలుగుతాయి. ఇక, శని, ఆదివారాలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత
మంచిది.

కన్య:  మీరంటే ఇష్టపడే వారు మీ సందేశాల కోసం ఎదురుచూస్తుంటారు. మీ ప్రతిపాదనలు శని, సోమవారాలు అందించండి, అవతలి వారు కూడా తక్షణం సానుకూల సందేశాలు పంపే వీలుంటుంది. ఈరోజుల్లో
మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మరింత శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి, లక్ష్యం నెరవేరవచ్చు. అయితే, శుక్ర, మంగళవారాలు మీ ప్రయత్నాలకు విరామం
ఇవ్వడం మంచిది.

తుల: మీరు అత్యంత ఇష్టపడేవారికి ప్రేమప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, సోమవారాలు ప్రయత్నించండి. ఈరోజులు అనుకూలమైనందున అవతలి వారు కూడా వెంటనే సానుకూలత వ్యక్తం చేసే
వీలుంటుంది. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్‌. పింక్‌  రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలలో వీటికి దూరంగా ఉండండి. 

వృశ్చికం: మీరు అభిమానించే వారికి మనస్సులోని అభిప్రాయాలను వెల్లడించేందుకు శని, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు అనుకూలత వ్యక్తం చేసే అవకాశం
ఉంది. అలాగే, ఇటువంటి సమయంలో మీరు గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే శుభాలు సిద్ధిస్తాయి. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, గురువారాలు వీటికి దూరంగా ఉండండి.

ధనుస్సు: మీరు అత్యంత ఇష్టపడేవారికి మనస్సులోని భావాలను వ్యక్తం చేసేందుకు సోమ, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలను అవతలి వారు వినయంగా స్వీకరించే
వీలుంటుంది. ఈరోజుల్లో మీరు వైట్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరితే విజయం సిద్ధిస్తుంది. ఇక, శుక్ర, ఆదివారాలు వీటికి విరామం ప్రకటించడం మంచిది.

మకరం: మీ ప్రేమసందేశాలను ఇష్టులకు అందించేందుకు శని, గురువారాలు మంచివి. మీ ప్రతిపాదనలపై అవతలి నుంచి కూడా అనుకూల స్పందనలు వచ్చే వీలుంది. ఈ సమయంలో మీరు రెడ్, గ్రీన్‌ రంగు
దుస్తులు ధరిస్తే శుభాలు కలుగుతాయి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. ఇక, ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. 

కుంభం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి నుంచి కూడా సానుకూలత వ్యక్తమయ్యే వీలుంది. ఈ సమయంలో మీరు
ఎల్లో, బ్లూ రంగు దుస్తులు ధరించండి. ఇక, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు మీ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.

మీనం: మీరు ఇష్టపడే వారికి ప్రేమసందేశాలు, పెళ్లి ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, సోమవారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో అవతలి వైపు నుంచి కూడా శుభసందేశాలు రావచ్చు. 

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు