ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!

2 Nov, 2019 17:14 IST|Sakshi

మేషం : వీరికి బుధ, గురువారాలు ప్రేమ వ్యవహారాలలో అనుకూలమైనవి. ఈ రోజుల్లో ఏ కార్యం చేపట్టినా అవాంతరాలు లేకుండా సాగిపోతుంది.  మీ భావాలను ఎదుటివారికి తెలియజేసేందుకు తగిన సమయం. అలాగే, మీరు ఇష్టపడే వ్యక్తుల నుంచి అనుకూల సందేశాలు అందే అవకాశం. ప్రపోజ్‌ చేయాలనుకునే సమయంలో క్రీమ్, ఆరెంజ్‌ దుస్తులు ధరిస్తే మేలు. ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టేటప్పుడు ఇంటినుంచి ఈశాన్యదిశగా అడుగులు వేసి ముందుకు సాగండి.

వృషభం : వీరికి మంగళ, బుధవారాలు ప్రేమ వ్యవహారాలు లేదా పెళ్లి ప్రతిపాదనలకు అనువైన కాలమని భావించాలి. మీ ప్రేమను వెల్లడించేందుకు కూడా తగిన సమయం. అలాగే, ఇష్టపడే వ్యక్తుల నుంచి సైతం ఇవే రోజుల్లో అనుకూల సందేశాలు అందవచ్చు. మీ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేయటానికి వెళుతుంటే వైట్, ఎల్లో దుస్తులు ధరిస్తే శుభం కలుగుతుంది. ప్రేమ సంబంధించిన పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటినుంచి తూర్పుముఖంగా బయలుదేరడం మంచిది.

మిథునం : వీరికి శుక్ర, శనివారాలు కలిసివచ్చే రోజులు. ఈ రోజుల్లో ప్రేమ, పెళ్లి  వ్యవహారాల్లో శుభం కలుగుతుంది. ప్రపోజ్‌ చేయటానికి కూడా ఈ రెండు రోజులు అనువైనవి. అలాగే, ఆవతలి వ్యక్తుల నుంచి ప్రేమ ప్రతిపాదనలు అందే అవకాశం ఉంది. ప్రపోజ్‌ చేయటానికి వెళుతుంటే గ్రీన్, రెడ్‌ దుస్తులు ధరిస్తే మంచిది. ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టేటప్పుడు ఇంటినుంచి ఉత్తరదిశగా బయలుదేరి వెళ్లడం మంచిది.

కర్కాటకం : ఈ రాశి వారు ప్రేమ, పెళ్లి వ్యవహారాలలో విజయం సాధించేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. మీ ప్రేమను ఎదుటివ్యక్తికి తెలియజేసేందుకు కూడా ఈ రోజులు ముఖ్యమైనవిగా భావించాలి. ఈ రోజుల్లో మీరు ఇష్టపడే వారు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలకు శ్రీకారం చుట్టేందుకు రోజ్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటినుంచి పశ్చిమ దిశగా బయటకు వెళ్లండి.

సింహం : ప్రేమ వ్యవహారాలకు సంబంధించి సోమ, మంగళవారాలు మీకు అనువైనవిగా భావించాలి. ఈ రోజుల్లో మీ ప్రేమ ప్రతిపాదనలకు సరైన స్పందన వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ మనస్సులోని ప్రేమను వెల్లడించడానికి, అలాగే, అవతలి వారి నుంచి సానుకూల సందేశం అందేందుకు ఈ రోజులు అనుకూలమైనవి. ప్రపోజ్‌ చేయటానికి వెళుతుంటే పింక్, వైట్‌ దుస్తులు ధరించండి. ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టేటప్పుడు ఇంటినుంచి తూర్పు దిశగా బయటకు వెళ్లండి.

కన్య : వీరికి బుధ, గురువారాలు అత్యంత లాభదాయకమైనవిగా భావించాలి. ఈ రోజులలో మీ ప్రేమను ఆవతలి వారికి తెలియజేసేందుకు అనువైనవి. మీ ప్రేమ ప్రతిపాదనలకు తగిన సమయం. అలాగే, మీరు ఇష్టపడే వారి నుంచి శుభసందేశాలు అందే అవకాశం ఉంది. ప్రేమను తెలియజేయటానికి వెళుతుంటే క్రీమ్, రెడ్‌ దుస్తులు ధరిస్తే మంచిది.  ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటినుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి.

తుల : ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రతిపాదనలకు శుక్ర, శనివారాలు అనువైనవిగా భావించాలి. ఈ రోజులలో మీ మనస్సులోని ప్రేమను వెల్లడించవచ్చు. అలాగే, ఇదే సమయంలో అవతలి వారి నుంచి కూడా ఆశ్చర్యకరమైన విధంగా సానుకూల సందేశాలు అందవచ్చు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన పనుల కోసం ఆరెంజ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ప్రేమ పతిపాదనలు చేసేప్పుడు ఇంటినుంచి పశ్చిమదిశగా బయలుదేరి వెళితే సానుకూలమయ్యే అవకాశం. 

వృశ్చికం : మీ ప్రేమను తెలియజేసేందుకు సోమ, మంగళవారాలు అనుకూలమైన రోజులు. అలాగే, మీ ప్రియమైన వారినుంచి కూడా మీరు ఊహించిన సందేశాలు అందవచ్చు. ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు గ్రీన్, గోల్డ్‌ రంగు దుస్తులు ధరించండి. ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటినుంచి ఉత్తరదిశగా బయలుదేరండి.

ధనుస్సు : వీరికి బుధ, గురువారాలు అత్యంత యోగదాయకమైనవిగా చెప్పాలి. ఈ రోజుల్లో ప్రపోజ్‌ చేయటానికి అలాగే, అవతలి వారి నుంచి సానుకూల సందేశాలు అందేందుకు అనువైనవిగా భావించాలి. ఈ ప్రపోజ్‌ చేయటానికి వెళుతున్నట్లయితే ఆరెంజ్, రెడ్‌ రంగు దుస్తులు ధరించాలి. ప్రేమ పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. 

మకరం : ఈ రాశి వారు ఆది, సోమవారాలు ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైనవిగా భావించాలి. మీ ప్రతిపాదనలు అందించేందుకు, అలాగే, ఇష్టపడే వ్యక్తుల నుంచి సానుకూల సందేశం అందేందుకు తగిన సమయం. ప్రేమ ప్రతిపాదనలు చేసే వారు ఎల్లో, పింక్‌ రంగు దుస్తులు ధరించాలి. ప్రేమ పతిపాదనలు చేసేప్పుడు ఉత్తర ఈశాన్య దిశగా ఇంటినుంచి బయలుదేరండి.

కుంభం : ప్రేమ వ్యవహారాలలో విజయం సాధించేందుకు వీరికి మంగళ, బుధవారాలు అనుకూలమైనవిగా భావించాలి. మీ మనోభావాలను ఎదుటి వ్యక్తికి చెప్పటానికి, అలాగే, ఇష్టపడే వ్యక్తుల నుంచి అనుకూల సందేశాలకు కూడా అనుకూలమైన రోజులు. లవ్‌ ప్రపోజల్‌కు వెళ్లేముందు వైట్, రోజ్‌ రంగు దుస్తులు ధరించాలి. అలాగే, పశ్సిమ వాయువ్యదిశగా ఇంటి నుంచి బయలుదేరండి.

మీనం : ప్రేమవ్యవహారాలకు సంబంధించిన ప్రతిపాదనలు, మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు శని, ఆదివారాలు అత్యంత కీలకమైనవి. అలాగే, మీరు ఇష్టపడే వ్యక్తుల నుంచి సైతం సానుకూలత  వ్యక్తమయ్యేందుకు ఇదే తగిన సమయం. మీ ప్రేమ ప్రతిపాదనలు చేసేందుకు ఆరెంజ్, వైట్‌ రంగు దుస్తులు ధరించాలి. ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టేటప్పుడు దక్షిణదిశగా ఇంటినుంచి బయలుదేరండి.

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమకు నియమాలు వర్తించవు

నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంతకైనా నిలబడతా!

మైసూరు అమ్మాయి, నెదర్లాండ్స్‌ అబ్బాయి

ఒక తెలివైన ప్రేమ కథ

ప్లీజ్‌ బిట్టూ నన్ను వదిలేయ్‌, మర్చిపో!

130 కేజీల అందమైన అమ్మాయితో ప్రేమ

అతడు నా గుండెల్లో ఉంటాడు

ఏం తప్పు చేశాను.. ఆమెను నా ప్రాణం కంటే..

‘ముత్యమంత ముద్దు’లాంటి ప్రేమ

ఆమె నవ్వితే నా బాధలు మర్చిపోతా! 

కెనడా రానన్నాను. దూరం పెరిగింది కానీ..

అతడంటే చాలా ఇష్టం, ప్రాణం కన్నా ఎక్కువగా..

ఆమె నన్ను మోసం చెయ్యలేదు

ఈ జంట ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం!

ఆమెను కొట్టి, రోడ్డు మీద వదిలేశాడు

29 ఏళ్లకే నూరేళ్లు నిండిన ప్రేమ

ఆ రోజు ధైర్యం చేసుంటే ఇలా అయ్యిండేది కాదు!

లెక్చరర్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు!

ప్రేమలో ఫెయిల్‌ అయ్యారా? ఇలా చేయండి!

నేను ఆమెను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు

ప్రేయసికి స్నేహితుడితో పెళ్లని తెలిసినా..

మోసం చేశాడు.. అంత అర్హత లేదు

భర్త ప్రాణాల కోసం సింహంతో పోరాడి..

ఆయన ఎప్పుడూ ఐ లవ్‌ యూ చెప్పరు