ప్రేమజాతకం 22-11-19 నుంచి 28-11-19 వరకు

22 Nov, 2019 11:30 IST|Sakshi

మేషం : ఈ రాశి వారు శని, ఆదివారాలు మీకిష్టమైన వారికి ప్రేమ ప్రతిపాదనలు చేసేందుకు, వివాహయత్నాలకు సానుకూలమైన కాలం. మీపట్ల ఆవతలి నుంచి కూడా ఇదే సమయంలో అనుకూల స్పందనలు రావచ్చు. ఇక మీ ప్రేమ ప్రతిపాదనలు అందించే సమయంలో ఎల్లో, గ్రీన్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. అయితే మంగళవారం మాత్రం ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

వృషభం : సోమ, గురువారాలు మీరు ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ సందేశాలు అందించేందుకు అనుకూల సమయం. ఈ రోజుల్లో ఆవతలి నుంచి కూడా మీరు ఆశించిన స్పందన రావచ్చు. మీ అభిప్రాయాలను వెల్లడించే సమయంలో వైట్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మేలు. ప్రేమ ప్రయత్నాలు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే అనుకూలత ఉంటుంది. అయితే ఆదివారం ఇటువంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమం.

మిథునం : మీ మనస్సులోని భావాలను మీరు ప్రేమించే వ్యక్తులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు అనుకూలమైనవి. ఈ కాలంలో ఎదుటి వ్యక్తులు కూడా సానుకూల వైఖరితో ఉండవచ్చు. ఇక మీ మనోగతాన్ని వెల్లడించే సమయంలో రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే ఆ సమయంలో తూర్పు ఈశాన్య దిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. వీరు శనివారం మౌనం వహించడం అన్ని విధాలా శ్రేయస్కరం.

కర్కాటకం : ప్రేమ సందేశాలు అందించేందుకు శని, ఆదివారాలు ఉత్తమమైనవి. ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలకు అవతలి వారి నుంచి కూడా సానుకూల స్పందన రావచ్చు. పింక్, వైట్‌ రంగు దుస్తులు ధరించి మీ ప్రేమ ప్రయత్నాలు సాగిస్తే ఫలితం కనిపిస్తుంది. అలాంటి సమయంలో పశ్చిమ వాయువ్య దిశగా ఇంటి నుంచి బయలుదేరండి. అయితే గురువారం ఇటువంటి వాటికి కొంత దూరంగా ఉండడం ఉత్తమం.

సింహం : ఆది,సోమవారాలు మీ అభిప్రాయాలను ప్రేమించే వారికి తెలియజేసేందుకు తగిన సమయం. ఈ రోజుల్లో మీరు అత్యంత ఇష్టపడే వారి నుంచి కూడా అనుకూల సందేశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆరెంజ్, బ్లూ రంగు దుస్తులు ధరించండి. అలాగే, మీ ప్రేమ ప్రయత్నాల సమయంలో ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. ఇక శుక్రవారం మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వడం మంచిది.

కన్య : వీరికి శుక్ర, బుధవారాలు అత్యంత అనుకూలమైన కాలం. ఈ రోజుల్లో తమ మనస్సులోని ప్రేమను ఇష్టమైన వారికి తెలియజేస్తే సానుకూల స్పందన రావచ్చు. ప్రపోజ్‌ చేయటానికి వెళుతున్న సమయంలో గ్రీన్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మరింత అనుకూలిస్తుంది. అలాగే, ప్రేమ ప్రయత్నాలు మొదలుపెట్టేప్పుడు ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. ఇక సోమ, మంగళవారాలు నిరాశాజనకమైన కాలం.

తుల : మీ అభిప్రాయాలను ఇష్టపడే వ్యక్తులకు వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రయత్నాలు ఫలించి అవతలి నుంచి కూడా అనుకూల సందేశాలు అందుకోవచ్చు. మీ ప్రేమ ప్రయత్నాల సమయంలో వైట్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, తూర్పుదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. అయితే ముఖ్యంగా బుధ, గురువారాలు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం : ప్రేమ, వివాహయత్నాలు సాగించే వారికి శని, బుధవారాలు అనుకూలమైనవి. ఈ కాలంలో చేసే ప్రేమ ప్రయత్నాలకు అవతలి నుంచి కూడా మంచి స్పందన వచ్చే వీలుంటుంది. మీ ప్రయత్నాలు సాగించే సమయంలో రెడ్, చాక్లెట్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. మంగళ, గురువారాలు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది.

ధనుస్సు : మీ మనస్సులోని ప్రేమను ఇష్టులకు వెల్లడించేందుకు శని, ఆదివారాలు అనుకూలమైనవి. ఈ సమయంలో పట్టుదలతో చేసే మీ ప్రయత్నాలు ఫలించే వీలుంది. ఆవతలి వైపు నుంచి కూడా కొంత సానుకూలత ఉండొచ్చు. ప్రేమ ప్రయత్నాలు మొదలుపెట్టే సమయంలో ఎల్లో, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మరింత కలసివస్తుంది. అలాగే, పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. అయితే, బుధ, గురువారాలు ప్రేమ వ్యవహారాలకు కొంత దూరంగా ఉండడం మంచిది.

మకరం : మీ మనస్సులోని భావాలను ఇష్టమైన వ్యక్తులకు తెలిపేందుకు ఆది, గురువారాలు అత్యంత అనుకూలమైన రోజులు. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. మీ ప్రతిపాదనల సమయంలో పింక్, గ్రీన్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. ఇక శుక్ర, శనివారాలు ఇటువంటి ప్రతిపాదనలు వద్దు.

కుంభం : మీ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, శనివారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ అభిప్రాయాలకు ఆవతలినుంచి సానుకూలత వ్యక్తం కావచ్చు. ఇటువంటి ప్రయత్నాల సమయంలో ఆరెంజ్, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. ఇక సోమ, మంగళవారాలు ఇటువంటివాటికి దూరంగా ఉండండి.

మీనం : శని, ఆదివారాలు మీకు ఇష్టమైన వారికి మీ మనోగతాన్ని వెల్లడించేందుకు అనుకూలమైన రోజులు. ఈ కాలంలో మీ ప్రతిపాదనలకు అవతలి వారి వైపు నుంచి కూడా సానుకూల సందేశాలు అందవచ్చు. ఇక మీ ప్రయత్నాల సమయంలో ఎల్లో, గ్రీన్‌ రంగు దుస్తులు ధరించండి. ఇక ఉత్తరదిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. అయితే మంగళ, బుధవారాలు మాత్రం ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది.



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు