ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!

29 Nov, 2019 14:49 IST|Sakshi

మేషం: వీరికి ప్రేమ, వివాహ ప్రతిపాదనలకు ఆది, సోమవారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలు చాలా వరకూ ఫలించే వీలుంది. వీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరించి ప్రతిపాదనలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే, దక్షిణ ఆగ్నేయదిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభాలు పొందుతారు. ఇక శుక్ర, గురువారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

వృషభం: బుధ, గురువారాలు ఈరాశి వారికి సానుకూలమైనవి. ఈ రోజుల్లో ఇష్టులకు మీ ప్రతిపాదనలు అందిస్తే అవతలి నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావచ్చు. ఇటువంటి వారు గ్రీన్, బ్లూ  రంగు దుస్తులు ధరించి మీ అభిప్రాయాలను వెల్లడిస్తే అవతలి వారు స్పందించే వీలుంది. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే విజయం మీ వెంటే ఉంటుంది. శని, ఆదివారాలు ఈ ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

మిథునం: మీకు ఇష్టమైన వ్యక్తులకు మీ సందేశాలు అందించేందుకు శని, బుధవారాలు అనుకూలమైనవి. ఇటువంటి ప్రతిపాదనలు అందించే సమయంలో వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే సానుకూలత ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమ వాయువ్యం దిశగా బయలుదేరండి. సోమ, మంగళవారాలు కొంత వ్యతిరేకత ఉండే రోజులు, వీటిని విస్మరించండి.

కర్కాటకం: అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ అభిప్రాయలను వెల్లడించేందుకు శుక్ర, శనివారాలు విశేషమైనవి. మీ ప్రతిపాదనలు అందించే సమయంలో పింక్, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఊహించని విధంగా అవతలి నుంచి సైతం అనుకూల సందేశాలు రావచ్చు. ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. అయితే ఇటువంటి ప్రతిపాదనలకు మంగళ, గురువారాలు అంతగా అనుకూలించవు. 

సింహం: మీలోని అభిప్రాయాలను వెల్లడించేందుకు ఆది, బుదవారాలు అనుకూలమైనవి.  మీ ప్రతిపాదనలు చేసేముందు ఎల్లో, పింక్‌ రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలకు సానుకూలత వ్యక్తం కావచ్చు. అలాగే, ఈ సమయంలో ఇంటి నుంచి తూర్పుఈశాన్యదిశగా బయలుదేరండి. ఇక శుక్ర, మంగళవారాలను విస్మరించండి.

కన్య: ఇష్టమైన వ్యక్తులకు మీ సందేశాలు అందించేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో అవతలి నుంచి సైతం సానుకూల వైఖరి వ్యక్తం కావచ్చు. ఈ సమయంలో మీరు పింక్, వైట్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర దిశగా బయలుదేరండి. అయితే శని, ఆదివారాలు ఇటువంటి ప్రతిపాదనలకు దూరంగా ఉండండి.

తుల: మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు శుక్ర, గురువారాలు విశేషమైనవి. ఈ సమయంలో మీ ప్రతిపాదనలకు సానుకూలత వ్యక్తం కావచ్చు. అలాగే, ఈ రోజుల్లో రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరించి అభిప్రాయాలు వెల్లడిస్తే అనుకూల సందేశాలు రావచ్చు. ఇక ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే మంచిది. అయితే మంగళ, బుధవారాలు విస్మరించండి.

వృశ్చికం: శని, బుధవారాలు మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు తగిన సమయం. ఈరోజుల్లో అవతలి నుంచి అనుకూల సందేశాలు వచ్చే వీలుంది. ఇటువంటి సమయంలో గ్రీన్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి, శుభాలు కలుగుతాయి. అయితే శుక్ర, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

ధనుస్సు: మీ మనస్సులోని భావాలను ఇష్టమైన వారికి వెల్లడించేందుకు ఆది, సోమవారాలు చాలా అనుకూలమైనవని చెప్పవచ్చు. ఈ రోజుల్లో అవతలి వారి నుంచి కూడా ఊహించిన సందేశాలు రావచ్చు. మీ ప్రతిపాదనలు చేసే సమయంలో వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, దక్షిణ ఆగ్నేయ దిశగా ఇంటి నుంచి బయలుదేరండి.  ఇక బుధ, గురువారాలు వ్యతిరేకమైనవి. ఈ సమయంలో మౌనం మంచిది.

మకరం: శని, బుధవారాలు మీ అభిప్రాయాలను వెల్లడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే, మీ ప్రతిపాదనలపై అవతలి వైపు నుంచి సానుకూల సందేశాలు అందుతాయి. ఈ సమయంలో మీరు రెడ్, గ్రీన్‌ రంగు దుస్తులు ధరించడం మంచిది. అలాగే, దక్షిణదిశగా ఇంటి నుంచి బయలుదేరండి.  ఇక శుక్ర, మంగళవారాలు ఇటువంటి ప్రతిపాదనలకు దూరంగా ఉండండి.

కుంభం: మీకు ఇష్టమైన వారికి మీ బావాలను వెల్లడించేందుకు సోమ, బుధవారాలు అనుకూలమైనవి. ఈ సమయంలో అవతలి వారి నుంచి కూడా అనుకూల సందేశాలు అందవచ్చు. అలాగే, మీ ప్రతిపాదన లు అందించే సమయంలో ఎల్లో, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక  శుక్ర, ఆదివారాలు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది.

మీనం: మీలోని భావాలను ఇష్టులకు వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి నుంచి సైతం సానుకూలత వ్యక్తం కావచ్చు. అలాగే, ఇటువంటి సమయంలో పింక్, రెడ్‌ రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. ఇక ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. అయితే బుధ, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు