ప్రేమ జాతకం 14-02-20 నుంచి 20-02-20 వరకు

14 Feb, 2020 10:17 IST|Sakshi

మేషం : మీలోనే దాచుకున్న ప్రేమ విషయాలను ఇష్టులకు తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలం. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి సమయంలో ఎల్లో, బ్లూ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

వృషభం : మనస్సులోని భావాలను, పెళ్ళి ప్రతిపాదనలను మీరు అభిమానించే వారికి తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో అవతలివారు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ప్రతిపాదనల సమయంలో మీరు రెడ్, గ్రీన్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అయితే, మంగళ,బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

మిథునం : ఇంతకాలం నిగూఢంగా మనస్సులోనే దాచుకున్న ప్రేమ సందేశాలను ఇష్టులకు తెలియజేసేందుకు ఆది, బుధవారాలు అత్యంత అనుకూలం. అవతలి వారు కూడా వీటికి సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు ఆరెంజ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక, శుక్ర, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి.

కర్కాటకం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మనస్సులోని భావాలను బుధ, గురువారాలు వెల్లడించండి. అవతలి వైపు నుంచి మీరు ఆశించిన సందేశాలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే అనుకూలత ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, శని, మంగళవారాలు మీ ప్రతిపాదనలకు విరామం ఇవ్వడం మంచిది.

సింహం : మీరు అత్యంత ప్రేమించే వ్యక్తులకు మీ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, గురువారాలు అత్యంత అనుకూలమని చెప్పాలి. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి కూడా అనుకూల సందేశాలు రావచ్చు. ఇక ఇటువంటి సమయంలో మీరు రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. అయితే, సోమ, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి.

కన్య : మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలను ఇష్టులకు అందించేందుకు మంగళ, బుధవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి వారు కూడా సానుకూలత వ్యక్తం చేసే వీలుంటుంది. ఈరోజుల్లో మీరు ఆరెంజ్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. అయితే, శని, సోమవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

తుల : మీ మనస్సులోని అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలపై అవతలివారు అనుకూలంగా స్పందించే వీలుంటుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు విరామం ఇవ్వండి.

వృశ్చికం : మీరు ఇష్టులైన వారికి ప్రేమసందేశాలు అందించేందుకు ఆది, బుధవారాలు అనుకూలం. ప్రతిపాదనలు చేసిన మరుక్షణం అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు ఎల్లో, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభవర్తమానాలు అందుతాయి. అయితే, శుక్ర, మంగళవారాలు వీటికి కొంత విరామం ఇవ్వడం మంచిది.

ధనుస్సు : మీరు కోరుకున్న వ్యక్తులకు ప్రేమసందేశాలు అందించేందుకు శని, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి వారు సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరితే శుభదాయకం. ఇక, ఆది, బుధవారాలు మీ ప్రయత్నాలను విరమించండి.

మకరం : మీ మనస్సులోని భావాలను ఇష్టులకు వెల్లడించేందుకు ఆది, మంగళవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో అవతలి వారు కూడా మీపట్ల మరింత ప్రేమానురాగాలు చూపే వీలుంటుంది. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, గ్రీన్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. అయితే, శని, గురువారాలు మీ ప్రతిపాదనలకు విరామం ఇవ్వండి. 

కుంభం : మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను ఇష్టులకు తెలియజేసేందుకు ఆది,బుధవారాలు అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. మీ ప్రతిపాదనలకు అవతలి వారు కూడా సానుకూల వైఖరి ప్రకటించవచ్చు. ఈ రోజుల్లో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే మంచిది. ఇక, శుక్ర, శనివారాలు దూరంగా ఉండండి.

మీనం : ఇష్టమైన వ్యక్తులకు మీ మనస్సులోని భావాలను వెల్లడించేందుకు బుధ, గురువారాలు అత్యంత సానుకూలమైన రోజులు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా తక్షణం స్పందించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో మీరు బ్లూ, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి.  ఇక, శుక్ర, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి.


మరిన్ని వార్తలు