జనం మెచ్చేలా పనిచేస్తాం: డీజీపీ

4 Jan, 2018 15:40 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : ప్రజలు మెచ్చుకునేలా తెలంగాణ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా డీజీపీ గురువారం మహబూబాబాద్, వరంగల్ అర్భన్ జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పోలీసుల పనితీరు బాగుందని కొనియాడారు. పోలీసుల పనితీరుతో రాష్ట్రవ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గిందని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో పౌరులకు ఒకే విధానం పాటిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పనితీరు బాగుందని ప్రశంసించారు.

అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన డీజీపీ హన్మకొండ మోడల్ పోలీస్ స్టేషన్‌ను, పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం నీట్ లో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.

మరిన్ని వార్తలు