పోలీస్‌ బాస్‌ సీరియస్‌?

9 Jan, 2018 07:55 IST|Sakshi

అధికారుల పనితీరుపై అసంతృప్తి

వత్తుగుండ్ల సంఘటనపై ఆరా

మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామన్న బాధితులు

నారాయణపేట: గత నెల 30న మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌కు ఎదురుతిరగడం.. గన్‌మెన్లు దాడికి దిగడంతో రైతుల ధర్నా.. తాజాగా వారిపై కేసుల నమోదే కాకుండా చితకబాదిన ఘటన పోలీసుల మెడకు చుట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు శనివారం వత్తు గుండ్లకు చెందిన రైతులు రఘువీరారెడ్డి, శివవీరారెడ్డి, ధర్మవీరారెడ్డి, మాల హన్మంతును అరెస్టు చేసి కోస్గి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారని చెబుతున్నారు. తమ ను పోలీసులు కోట్టారని శివవీరారెడ్డి జడ్జి ముందు వాపోవడంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జడ్జి ఆదేశించినట్లు శివవీరారెడ్డి వెల్లడించారు.

ఇక ఆదివారం రాత్రి నా రాయణపేటకు వచ్చిన మాజీ మంత్రి డీకే.అరుణకు విషయం తెలియడంతో సీఐ రామకృష్ణ, దామరగిద్ద ఎస్‌ ఐ నరేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వత్తుగుండ్ల రైతుల విషయంలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌ అయినట్లు సమాచారం. కేసులు చేస్తే అరెస్టు చేసి రిమాండ్‌ చేయాలే తప్ప చితకబాదడం సరికాదని వత్తుగుండ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు స రైన న్యాయం జరగపోతే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తా మని బాధిత రైతు శివవీరారెడ్డి తెలిపారు.  

ఎవరినీ కొట్టలేదు..
వత్తుగుండ్లలో జరిగిన సంఘటన కేసులో రైతులు శివవీరారెడ్డి, ధర్మావీరారెడ్డి, హన్మంతు, రఘువీరారెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం వాస్తవమేనని నారాయణపేట సీఐ రామకృష్ణ వెల్లడించారు. అయితే, శివవీరారెడ్డి పోలీ సు వాహనంలో ఎక్కే సమయంలో దురుసుగా వ్యవహరించాడన్నారు. ఆయన వాహనంలో ఎక్కించే సమయంలో డోర్లు వేయకుండా అడ్డుకోగా చేతులు, కాళ్లకు తగిలాయే తప్ప తాము ఎవరికీ కొట్టలేదని తెలిపారు.

మరిన్ని వార్తలు