జొన్న ప్రొటీన్లు మిన్న

10 Mar, 2019 07:37 IST|Sakshi

జొన్నరొట్టెకు పెరిగిన డిమాండ్‌
కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే జొన్నరొట్టెలను తింటేనే ఆరోగ్యంగా ఉంటారని  డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే కొవ్వును తగ్గించడానికి జొన్నరొట్టెలు ఎంతో ఉపయోగపడతాయని చెబుతుండటంతో వాటిని తినేందుకు పట్టణ ప్రజలు, ఉద్యోగస్తులు ఆసక్తి చూపుతున్నారు. కొత్తకోట పట్టణంలోని కర్నూల్‌ రోడ్డులో పదుల సంఖ్యలో జొన్నరొట్టె సెంటర్లు వెలిశాయి. చాలామంది మహిళలు వీటినే ఉపాధిగా మలుచుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారు. 

ఆహారపు అలవాట్లలో మార్పులు 
ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెడుతున్నారు. రుచిని కాకుండా ఆహార ఉపయోగాల విషయాలపై దృష్టి పెడుతున్నారు. వైద్యుల సూచనలతో దురలవాట్లను మార్చుకుని జంక్‌ఫుడ్‌తో కలిగే అనర్థాలను తెలుసుకుని జొన్నరొట్టె వైపు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆహారంలో మంచి పోషక విలువలు కలిగి ఉండటంతో జొన్నరొట్టెలకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కరొట్టె రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది.చాలామంది

ఇష్టంగా తింటున్నారు 
నేను ఇంట్లోనే జొన్న రొట్టెలు చేసి అమ్ముతాను. కాలనీలోని వారు, ఉద్యోగస్తులు ఎంతో ఇష్టంగా ఆర్డర్‌ ఇచ్చి రొట్టెలు చేయించుకుంటారు. ప్రజలకు జొన్నరొట్టెలు తినడం అలవాటు కావడంతో నాకు గిరాకీ బాగా పెరిగింది. ఒక్కోసారి 50 నుంచి 60 రొట్టెలు అమ్ముతాను. 
– జ్యోతి, కొత్తకోట      

Read latest Mahabubnagar News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు