ఇన్‌చార్జిగానే మున్సిపల్‌ కమిషనర్‌!

18 Jan, 2018 08:48 IST|Sakshi

పూర్తిస్థాయి బాధ్యతలు లేక ఇబ్బందులు

పండుగ పూట వేతనాలకు విలవిల

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : గతంలో పని చేసిన మున్సిపల్‌ కమిషనర్‌ భూక్యా దేవ్‌సింగ్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన అనంతరం  ఆ స్థానంలో నియమించిన ఫారెస్టు సెటిల్‌మెంట్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.రాంచందర్‌ ఇన్‌చార్జిగా మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ముఖ్యమైన వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రజల పెండింగ్‌ ఫిర్యాదులు, వినతి పత్రాలపై సరై న నిర్ణయం తీసుకోవడం, వివిధ పద్దుల కింద బిల్లులు, ఇతర చెల్లింపులు చేసే అధికారం ఇన్‌చార్జి కమిషనర్‌కు లేకపోవడంతో పలుఇబ్బందులు ఏర్ప డుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో జనవరి వేతనాలు అందక పారిశు ద్ధ్య సిబ్బంది, కాంట్రాక్టు వర్కర్లు ఇబ్బందిపడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలురావడం తగ్గింది.కౌన్సిలర్లు సైతం రావడానికి నిరాసక్తిగా ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు రావడంలేదని పలువురు కాంట్రాక్టర్లు ఆం దోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే మున్సి పల్‌ కార్యాలయం బోసిపోయి దర్శనమిస్తున్నది.

ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడని అధికారులు  
ఎప్పుడూ వివాదాలకు నెలవుగా ఉంటుందన్న భావనతో మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీకి కమిషనర్‌గా రావడానికి అధికారులు ఇష్టపడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ లేదా మున్సిపల్‌ ఇంజనీర్లకు కాకుండా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఇన్‌చార్జి కమిషనర్‌ను నియమించడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు