రికార్డుస్థాయి నుంచి  భారీ నష్టాల్లోకి

20 Jan, 2020 14:45 IST|Sakshi

గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ

42 వేల మార్కును కోల్పోయిన సెన్సెక్స్‌  

 నిఫ్టీ 12,300 దిగువకు

సాక్షి,ముంబై: మార్కెట్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్‌ 42వేల దిగువకు, నిఫ్టీ 12300 దిగువన  కొనసాగుతున్నాయి. గరిష్టస్థాయిలకు చేరుకోవడంతో  లాభాల స్వీకరణకు తోడు అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుదల భయం తీవ్ర నష్టాలకు కారణమవుతోంది.  ప్రధానంగా హెవీ వెయిట్స్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లలో అనూహ్య అమ్మకాలతో పాటు ఐటీ, బ్యాంకింగ్‌, పెట్రోరంగ కంపెనీలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లలో అనూహ్య అమ్మకాలు సూచీలను గరిష్టస్థాయిల నుంచి వెనక్కి లాగాయి. ఫలితంగా 42,274 గరిష్టం నుంచి   700 పాయింట్లు పతనమైన  సెన్సెక్స్‌ 355 పాయింట్లు కుప్పకూలి 41591వద్దకు చేరగా, నిప్టీ రికార్డు స్థాయి 12,430 నుంచి  పడి, ప్రస్తుతం 105 పాయింట్లు నష్టపోయి 12,246 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.  ముఖ్యంగా బ్యాంకు నిఫ్టీ టాప్‌ లూజర్‌గా ఉంది. ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు  స్వల్పంగా లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు