53 వేల కోట్లు నష్టపోయిన జుకర్​బర్గ్

27 Jun, 2020 12:08 IST|Sakshi

ఫేస్​బుక్​కు యాడ్స్ నిలిపేసిన కంపెనీలు

వాషింగ్టన్: నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్​బుక్​ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది. (భారత్‌లో గూగుల్‌ పే బ్యాన్‌? ఎన్‌పీసీఐ క్లారిటీ)

ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమైంది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్​బుక్ ను బాయ్​కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇకపై ఆ సంస్థకు యాడ్స్ ఇవ్వబోమని ప్రకటించాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు సోషల్ మీడియా సంస్థలకు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. (యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ డౌన్‌గ్రేడ్)

దీంతో ఫేక్ న్యూస్ పై సంస్థ సీఈవో మార్క్ జుకర్​బర్గ్ స్పందించారు. అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని చెప్పారు. విద్వేషపూరిత వ్యాఖ్యల పరిధిని సైతం పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇకపై రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు.

Read latest Market News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు