నేడు గ్యాపప్‌ ఓపెనింగ్‌!

19 May, 2020 10:31 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 143 పాయింట్లు ప్లస్‌-యూఎస్‌ ఇండెక్సులు 4-2.5% అప్‌-లాభాల్లో ఆసియా మార్కెట్లు

నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతంలో 143 పాయింట్లు జంప్‌చేసి 8,970 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్స్‌ 8,827 వద్ద ముగిశాయి.కాగా.. ప్రపంచ దేశాలన్నిటినీ వణికిస్తున్న కోవిడ్‌-19 నివారణకు వ్యాక్సిన్‌ రానున్నదన్న అంచనాలు సోమవారం యూఎస్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి.దీనికితోడు అవసరమైతే మరో ప్యాకేజీకి సిద్ధమంటూ ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలు ఇవ్వడం కూడా ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి సోమవారం యూఎస్‌ ఇండెక్సులు 4-2.5 శాతం  మధ్య ఎగశాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్నాయి. దీంతో దేశీయంగానూ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ప్రారంభమయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అంచనాలు సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. 

నిఫ్టీ కదలికలు
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 8701 వద్ద, తదుపరి 8578 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ మార్కెట్లు జోరందుకుంటే.. మొదట 9,052 వద్ద, ఆపై 9281 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురయ్యే అవకాశమున్నట్లు సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి 17360 వద్ద, 17140 వద్ద సపోర్ట్‌ కనిపించే వీలుంది. ఇదే విధంగా 17900 వద్ద, 18300 స్థాయిల వద్ద అవరోధాలు ఎదురుకావచ్చునిని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సోమవారం రూ. 2513 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 152 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. 

మరిన్ని వార్తలు