తొలి క్వార్టర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏయూఎం రూ.25 లక్షల కోట్లు

3 Jul, 2020 16:33 IST|Sakshi

త్రైమాసిక ప్రాతిపదికన 8శాతం క్షీణత

మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో రూ.25లక్షల కోట్లకు చేరుకున్నాయి. క్రితం త్రైమాసికంలో నమోదైన రూ.27 లక్షల కోట్లు ఏయూఎంతో పోలిస్తే ఇది 8శాతం తక్కువ. ఈ తొలి త్రైమాసికంలో ఈక్విటీలు, డెట్‌ మార్కెట్లలో అవుట్‌ఫ్లో ఒత్తిళ్లు పెరగడంతో ఆస్తుల నికర విలువ తగ్గినట్లు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ తెలిపింది. మ్యూచువల్‌ ఫండ్ల పరిశ్రమలోని 45 సంస్థల నిర్వహణలోని ఆస్తులు రూ.24.82లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో నిఫ్టీ ఇండెక్స్‌ 24శాతం ర్యాలీ చేసినప్పటికీ... డెట్‌, ఈక్విటీ మార్కెట్లో అవుట్‌ఫ్లోలు పెరగడంతో ఫండింగ్‌ సంస్థలు ఒత్తిడికి లోనయ్యాయి. మ్యూచువల్‌ ఫండ్‌ ఫథకాల్లో నికర ఇన్‌ఫ్లో తగ్గడంతో త్రైమాసిక ప్రాతిపదికన ఇండస్ట్రీస్‌ 8శాతం క్షీణతను చవిచూసినట్లు సామ్‌కో సెక్యూరిటీస్‌  తెలిపింది.

ప్రస్తుతం 45 ఫండ్ హౌస్‌లు ఉన్నాయి. ఇందులో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ లైఫ్‌, నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ టాప్‌-5 ఫండింగ్‌ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఇందులో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.3.64లక్షల కోట్ల ఏయూఎంతో అ‍గ్రస్థానంలోనూ, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.3.56లక్షల కోట్లతో రెండో స్థానంలో, ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.3.46లక్షల కోట్ల ఏయూఎంతోనూ మూడో స్థానంలో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు