రిలయన్స్‌ @ రూ.2000

22 Jul, 2020 12:03 IST|Sakshi

క్యూ1 ఫలితాలు జూలై 31కు వాయిదా

దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు బుధవారం రూ.2000లు అందుకుంది.  నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.1980 వద్ద మొదలైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ.., రిలయన్స్‌ షేరు స్థిరమైన ర్యాలీ చేసింది. ఫలితంగా ఒక దశలో 1.50శాతం లాభపడి రూ.2000 మార్కును అందుకుంది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.12.6లక్షల కోట్లను అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1971.85)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.1992 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది (2020)లో రియలన్స్‌ షేరు 32శాతం ర్యాలీ చేసింది. ఇటీవల మార్చి కనిష్ట స్థాయి(రూ.867.82) నుంచి ఏకంగా 130 శాతం లాభపడటం విశేషం. 

బోర్డు సమావేశం జూలై 31కు వాయిదా: 
రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు డైరెక్టర్ల సమావేశాన్ని జూలై 24నుంచి జూలై 30కు వాయిదా వేస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీంతో రియలన్స్‌ క్యూ1 గణాంకాలు జూలై 30వ తేదిన వెల్లడి కానున్నాయి. 

మరిన్ని వార్తలు