నేటి వార్తల్లోని షేర్లు

19 May, 2020 10:50 IST|Sakshi
stocks in news

వివిధ వార్తలకు అనుగుణంగా నేడు స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

క్యూ4 ఫలితాలు: బజాజ్‌ ఫైనాన్స్‌, అపోలో టైర్స్‌, ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ, లార్సన్‌ అండ్‌ టుబ్రో ఇన్ఫోటెక్‌, గ్యాబ్రెల్‌ ఇండియాలు మంగళవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి.

వేదాంత: ప్రమోటర్‌ అనీల్‌ అగర్వాల్‌ ప్రతిపాదించిన డీలిస్టింగ్‌ ప్రతిపాదనను వేదాంత కంపెనీ బోర్డు ఆమోదించినట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు ఇచ్చిన సమాచారంలో వేదాంత కంపెనీ పేర్కొంది.

ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌: బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన చిరంజీ లాల్‌ అగర్వాల్‌ కంపెనీలోని 25 లక్షల షేర్లను  బహిరంగ మార్కెట్లో రూ.103 కోట్లకు విక్రయించారు.

రేమండ్‌: ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.100 కోట్ల సమీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. 

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన రూ.1,030 కోట్లు సమీకరించినట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

డాక్టర్‌ పాత్‌ల్యాబ్స్‌: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 31.2 శాతం తగ్గి రూ.32.6 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది.

టాటా కన్జూమర్‌: బేవరేజ్‌ వ్యాపార విస్తరణలో భాగంగా నారీష్‌ కో బేవరేజెస్‌లో మిగిలిన మొత్తం వాటాను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

టొరంట్‌ పవర్‌: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.273.94 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.24.80 కోట్లుగా నమోదైందని తెలిపింది.
 

Related Tweets
మరిన్ని వార్తలు