ఎండిన పంట ఆగిన గుండె

3 Mar, 2019 11:48 IST|Sakshi
మృత దేహం వద్ద రోదిస్తున్న దృశ్యం

సాక్షి,వర్ధన్నపేట: పండిన పంట ఎండిపోవడంతో రైతు గుండె ఆగిపోయింది. నీటి కోసం  బోర్లు వేస్తే కన్నీరే మిగిలింది. చేసిన అప్పుల భారం పెరగడంతో ఆయువు తీసుకున్న ఘటన వర్ధన్నపేటలో శనివారం జరిగింది. వర్ధన్నపేట మునిసిపాలిటీ పరిధిలోని డీసీ తండా శివారు గుబ్బెటి తండాకు చెందిన ఆంగోతు మొగిళి(50) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో గతంలో ఉన్న బోరుబావి ఎండిపోయింది. నీటి వసతి లేక పోవడంతో మూడు బోరు బావులు తవ్వినా నీరు రాలేదు.

దీంతో పాటు రాయపర్తి మండలం తిర్మాలాయపెల్లికి చెందిన వశపాక నర్స ఎల్లయ్యకు చెందిన 30 గుంటల భూమి కౌలుకు తీసుకుని వ్యసాయం చేస్తున్నాడు. ఈ రబీలో బోరులో నీరు ఎక్కువగా రాదని గ్రహించి తన భూమిలోని 30 గుంటల్లో వరి నాటు వేశాడు. వేసవి రాక ముందే నీరు పోసే బోరు ఎండి పోవడంతో వరి పంట ఎండి పోతుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొగిళికి  భార్య కౌసల్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు