చేతిశుభ్రతపై అశ్రద్ధ

20 Feb, 2018 16:16 IST|Sakshi
ట్యాంక్‌ వద్ద చేతులు కడుక్కుంటున్న విద్యార్థులు

పాఠశాలల్లో అమలుకు నోచుకోని చేతిశుభ్రత

అందుబాటులో లేని సబ్బులు, టవల్స్‌

పట్టించుకోని విద్యాధికారులు

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యంపై విద్యార్థులకు ముందుగా చేతిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. దానికి నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఆశించినంతగా ఫలితాలు రావడంలేదు. నిధుల వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

టేక్మాల్‌(మెదక్‌) : టేక్మాల్‌ మండలంలో 40 ప్రాథమిక, 7 ఉన్నత, 6 ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నాయి. మొత్తం 4,600 మంది విద్యార్థులన్నారు. ఏ పాఠశాలలో కూడా చేతిశుభ్రత కార్యక్రమం అమలు చేస్తున్న దాఖలాలులేవని స్థానికులు చెబుతున్నారు. విరామ సమయాల్లో విద్యార్థులు ఆటలాడుకుంటారు. అప్పుడు వారి చేతులు అపరిశుభ్రంగా మారతాయి. భోజనం చేసేముందు కొందరు మాత్రమే చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. మిగిలిన వారు శుభ్రం చేసుకునేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. అంతేకాకుండా సబ్బులు, న్యాపికిన్స్‌ అందుబాటులో ఉంచాలి.

ఘనంగా చేతుల శుభ్రత దినం 
ఏటా సెప్టెంబర్‌18న చేతుల శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ర్యాలీలు నిర్వహిస్తుంటారు.  సర్వశిక్ష అభియాన్‌ ద్వారా ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలలకు 7 వేల చొప్పున ఇస్తున్నారు. 

శుభ్రతపై  దృష్టిసారించాలి
పిల్లలు మట్టిలో ఆడుకుంటారు. ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేతుల్లో చేరుతుంది. అలాంటి చేతులను శుభ్రపరచకుండా భోజనం చేస్తుంటారు. దీంతో వ్యాధుల బారినపడుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పరిశుభ్రత విషయంలో ఉపాధ్యాయులు, అధికారులు దృష్టిసారించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాఠశాలలో నీటి వసతి లేదు 
తాగునీరు లేకపోవడంతో ఇంటి నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. ఇక్కడ కలుషితనీటిని తాగడంతో అనారోగ్యం పాలవుతున్నాం. చేతులు శుభ్రం చేసుకోవాలంటే సబ్బు ఉండదు. నీటితోపాటు సబ్బులు కూడా అందుబాటులో ఉంచాలి.                       
 – సాయిబాబా విద్యార్థి

అమలు చేయిస్తాం
ప్రతి పాఠశాలలో చేతుల శుభ్రత కార్యక్రమాన్ని విధిగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించాం. సబ్బులు, తువ్వాలు అందుబాటులో ఉంచాలని సూచించాం.  ఏవైనా వ్యాధులు వస్తే  వైద్యులను సంప్రదించాలన్నాం. 
– నర్సింలు, ఎంఈఓ  

మరిన్ని వార్తలు