గుడుల్లోకి అందరినీ రానివ్వాలి

12 Feb, 2018 16:54 IST|Sakshi
మాట్లాడుతున్న సత్యంజీ

అప్పుడే ధర్మాన్ని రక్షించవచ్చు

 వీహెచ్‌పీ జాతీయ సహ కార్యదర్శి సత్యంజీ

రామాయంపేట(మెదక్‌): దేవాలయాల్లో అన్ని వర్గాలవారికి ప్రవేశం ఉంటేనే ధర్మాన్ని రక్షించవచ్చని వీహెచ్‌పీ జాతీ య సహ కార్యదర్శి సత్యంజీ సూచించా రు. స్థానిక వివేకానంద ఆవాస విద్యాలయంలో ఆదివారం జరిగిన వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటే నే అసలైన సార్ధకత లభిస్తుందన్నారు. గ్రామాల్లో కలిసికట్టుగా ఉంటేనే హిందూ సమాజం ముందుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి ఆశయ సాధన మేరకు ఆవాస విద్యాలయం పేద విద్యార్థులకోసం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో మెదులుతున్నారని ఆయన ప్రశంసించారు. ఆవాస విద్యాలయం వ్యవస్థాపకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ స్కూలులో చిన్ననాటి నుంచే విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతున్నామన్నారు.  ఆవాసం ఆధ్వర్యంలో రామాయంపేట, చే గుంట, చిన్నశంకరంపేట మండలాల్లోని 30 గ్రామాల్లో బాల సంస్కార కేంద్రాలు, కిశోర వికాస కేంద్రాలు, గ్రం థాలయాలు, అభ్యాసికలు, భజన మండళ్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

వచ్చే ఏడాదిలోగా కనీసం 60  సేవా కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి ఆశయ సాధన విషయమై మనందరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్కూల్‌ కార్పస్‌ ఫండ్‌ పెంచితే మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉందని, దీంతో పేద విద్యార్థులకు మరింతగా లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు రాంచరణ్‌యాదవ్‌ మాట్లాడుతూ ఆవాసం విద్యార్థులు భారతమాత సేవలో çపునీతులవుతున్నారని ప్రశంసించారు. ఇందులో చిన్ననాటి నుంచే పిల్లలకు  మంచి సంస్కారం నేర్పడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా చల్మెడ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ దొంతినేని రాధిక పది మంది విద్యార్థులను దత్తత తీసుకొని రూ. లక్షా 50 వేల చెక్కు అందజేశారు. పది మంది పిల్లలకు అయ్యే ఖర్చులు తామే భరిస్తామని ఆమె పేర్కొన్నారు.   ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గేయాలు, నృత్యాలతో అలరించారు.  సంస్థ ప్రతిని ధులు బాణాల సూర్యప్రకాశరెడ్డి, సంగమేశ్వర్, పండరీనా«థ్, రఘుపతిగౌడ్, లక్ష్మణ్‌యాదవ్, పబ్బ సత్యం, శీలం మల్లారెడ్డి, బాల్‌రెడ్డి, ముత్యాలు, రాజు, నవాత్‌ మల్లేశం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు