100 మంది డ్యాన్సర్లు... 4 దేశాలు!

19 Nov, 2017 00:14 IST|Sakshi

ఒక సాంగ్‌ను సూపర్‌గా షూట్‌ చేయాలనుకుంటే రిచ్‌ లొకేషన్స్‌ కోసం విదేశాలను సెలెక్ట్‌ చేస్తారు దర్శక–నిర్మాతలు. అక్కడి లోకల్‌ జూనియర్‌ ఆర్టిస్టులనే తీసుకుంటారు. కానీ, అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్‌ జంటగా రూపొందిన ‘టైగర్‌ జిందా హై’ సినిమాలోని ‘స్వాగ్‌ ఇన్‌ స్వాగ్‌ సే స్వాగత్‌..’ సాంగ్‌ కోసం 4 దేశాల నుంచి 100 మంది డ్యాన్సర్లను రప్పించి, షూట్‌ చేశారు. సాంగ్‌ షూట్‌ లేట్‌ అవ్వకూడదని గ్రీస్, ఫ్రాన్స్, ఇటలీ, ట్రినిడాడ్‌ దేశాల నుంచి రప్పించిన జూనియర్‌ ఆర్టిస్టులకు ముందుగానే డ్యాన్స్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు.

వీళ్లతో పాటు సల్మాన్, కత్రినా వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉంటాయట. ‘‘ఈ సినిమాకి ఈ పాట కీలకంగా ఉంటుంది. ‘సెలబ్రేటింగ్‌ పీస్‌’ అన్న కాన్సెప్ట్‌తో సాంగ్‌ను రూపొందించాం. అందుకే ఇలా నాలుగు దేశాలకు చెందిన ఆర్టిస్టులతో ప్లాన్‌ చేసి షూట్‌ చేశాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌. 2012లో వచ్చిన ‘ఏక్తా టైగర్‌’ సినిమాకు ‘టైగర్‌ జిందా హై’ చిత్రం సీక్వెల్‌ అన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కత్రినా యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటించారు. డిసెంబర్‌ 22న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు