కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

10 Aug, 2019 07:00 IST|Sakshi

11 పురస్కారాలు దక్కించుకున్న శాండల్‌వుడ్‌

సాక్షి బెంగళూరు :  66వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కన్నడ సినిమాలు పంట పండించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 అవార్డులను కన్నడ సినిమాలు దక్కించుకున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రముఖ నటి శ్రుతి హరిహరన్‌ నటించిన నాతిచరామి సినిమా అత్యధిక అవార్డులను దక్కించుకుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేజీఎఫ్‌ సినిమా ఉత్తమ యాక్షన్‌ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. నాతిచరామి సినిమాకు మొత్తం5 అవార్డులు, కేజీఎఫ్‌ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. అలాగే ప్రముఖ కథానాయకుడు రిషబ్‌ శెట్టి నటించిన ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలె కాసరగోడు’ చిత్రం కూడా అవార్డును గెలుచుకుంది. ఈసారి ఏకంగా 11 అవార్డులను దక్కించుకుంది. కన్నడ చలనచిత్ర చరిత్రలో ఇంతటిస్థాయిలో కర్ణాటకకు అవార్డులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముంబైలోని శాస్త్రి భవన్‌ హాల్‌లో ఈ అవార్డులను అందజేశారు. మొత్తం 31 విభాగాల్లో పురస్కారాలను ఇచ్చారు. కాగా, నాతిచరామి సినిమాలో చక్కని నటనకు గాను ప్రత్యేక అవార్డు పొందిన శ్రుతి హరిహరన్‌ సంతోషం రెట్టింపయింది. ఒకవైపు అవార్డు వచ్చిన ఆనందం కాగా, మరోవైపు తన జీవితంలో ఒక పండంటి ఆడబిడ్డకు శ్రుతి హరిహరన్‌ జన్మనిచ్చారు. 

కన్నడ సినిమాల అవార్డుల జాబితా
1. ఉత్తమ ప్రాంతీయ చిత్రం నాతిచరామి
2. ఉత్తమ మహిళా గాయని – బింధు మాలిని (నాతిచరామి–మాయావి మానవే హాడు)
3. ఉత్తమ సాహిత్యం – నాతిచరామి
4. ఉత్తమ ఎడిటింగ్‌ – నాతిచరామి
5. ఉత్తమ సాహస చిత్రం – కేజీఎఫ్‌
6. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ చిత్రం – కేజీఎఫ్‌
7. ఉత్తమ జాతీయ ఏకత్వ చిత్రం – ఒందల్ల, ఎరడల్ల
8. ఉత్తమ బాల నటుడు – పీవీ రోహిత్‌ (చిత్రం– ఒందల్ల, ఎరడల్లా)
9. ఉత్తమ బాలల చిత్రం – ‘సర్కారీ హిరియ ప్రాథమిక శాలే కాసరగోడ
10. ఉత్తమ చిత్రం– మూకజ్జియకనసుగళు
11. ప్రత్యేక అవార్డు – నాతిచరామి చిత్రానికి గాను శ్రుతి హరిహరణ్‌ 

మరిన్ని వార్తలు