నీ కోసం నిరీక్షణ

13 Jun, 2020 06:15 IST|Sakshi
కమల్‌హాసన్, రజినీకాంత్, శ్రీదేవి

కమల్‌హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ముఖ్య తారాగణంగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘పదినారు వయదినిలే’. ఇదే సినిమా తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, మోహన్‌బాబు, శ్రీదేవి కాంబినేషన్‌లో రీమేక్‌ అయింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు తమిళ అనువాదాన్ని చూడబోతున్నారు. తమిళ వెర్షన్‌ని అధునాతన డాల్బీ సౌండ్‌ పద్ధతిలో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్‌ చేసి అన్ని పాటలను కొత్తగా పొందుపరచారు.

సామాజిక మాధ్యమం ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో పాటుగా ఐదు భాషల్లో అనువదించడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు సుప్రీమ్‌ ఆల్మైటీ క్రియేషన్స్‌ నిర్మాణసంస్థ వెల్లడించింది. తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ అనే టైటిల్‌ను పెట్టారు. నిర్మాత బామారాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం  పాటలకు మంచి స్పందన లభిస్తోంది.  30 నిమిషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం’’ అని అన్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు