భారీ వ్యూస్‌ సాధించిన ‘గడ్డి తింటావా’ సాంగ్‌

21 Jul, 2020 18:48 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ సినిమాతో మరో సంచలనానికి తెరతీశారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మామూలుగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసే ఆర్జీవీని.. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘గడ్డి తింటావా’ సాంగ్‌ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ పాటను 17 లక్షల మంది వీక్షించారని ఆర్జీవీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పాట విడుదలైన రెండు రోజుల్లోనే ఇంత భారీ రెస్పాన్స్‌ రావడంపై ఆయన స్పందిస్తూ.. ఈ విజయం ‘ప్రవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అంకితం’అని ట్వీట్‌ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

ఇక ‘పవర్‌ స్టార్‌’ సినిమా ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో చూసేందుకు రూ.25 చెల్లించాలని ఆర్జీవీ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ రేపు (బుధవారం) ఉదయం 11 గంటలు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుదల కానుంది. ఇలా ట్రైల‌ర్ చూసేందుకు డబ్బులు వ‌సూలు చేస్తోన్న తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం. రూ.25 చెల్లించి సినిమా ట్రైలర్‌ చూడాలని తాజా ట్వీట్‌లో ఆర్జీవీ మరోసారి స్పష్టం చేశారు. పవర్‌ స్టార్‌ సినిమా జూలై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుదల చేయనున్నారు ఆర్జీవీ.
(‘ఆర్జీవీపై ఇష్టంతో.. ఆ సినిమాకు నో చెప్పాను’)

మరిన్ని వార్తలు