ప్రభాస్‌ చేతుల మీదుగా‘22’ లిరికల్‌ వీడియో

22 Feb, 2020 18:00 IST|Sakshi

రూపేష్‌ కుమార్, సలోని మిశ్రా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘22’.. విభిన్న కథతో వస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ పీఆర్వో బీఏ రాజు తనయుడు శివ కుమార్‌.బి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, టీజర్‌ను  కింగ్‌ నాగార్జున విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో‘మార్‌ మార్‌కే జీనా హై’ అనే పాటను టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ శనివారం విడుల చేశారు. పాట విడుదల అనంతరం ప్రభాస్‌ మాట్లాడుతూ.. 22 మూవీ లిరికల్‌ వీడియో సాంగ్‌ చాలా బాగుందని, టీజర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు. ‘ 22’  కచ్చితంగా ఒక డిఫరెంట్‌ మూవీ అవుతుందని చెప్పారు. పోలీసు డ్రెస్‌లో రూపేష్‌ చాలా బాగున్నాడని ప్రశంసించారు. సినిమా బిగ్‌హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నానని ప్రభాస్‌ పేర్కొన్నారు.

హీరో రూపేష్‌ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను ప్రభాస్‌ లాంచ్‌ చేయడం సంతోషంగా ఉందన్నారు. ‘ ప్రభాస్‌ లాంటి పెద్ద స్టార్ న‌న్ను ఎంక‌రేజ్ చేస్తూ పోలీస్ డ్రెస్‌లో చాలా బాగున్నావ‌ని అన‌డం ఒక అవార్డులా భావిస్తున్నాను. మంచి లిరిక్స్‌రాసిని కాస‌ర్ల శ్యామ్‌కి, మంచి సంగీతం అందించిన సాయికార్తీక్‌కి థ్యాంక్స్‌. కార్తీక్‌ సినిమాకి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మ‌మ్మత్ని ప్రొత్సహించారు. ఈ అవ‌కాశం ఇచ్చిన దర్శకుడు శివ‌కి ధన్యవాదాలు’  అన్నారు.

చిత్ర ద‌ర్శకుడు శివ‌కుమార్. బి మాట్లాడుతూ ‘ 22-02-2020 రోజున మా ‘22’ మూవీ ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియోను ప్రభాస్‌ విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంది. ప్రభాస్‌ ఈ సాంగ్ లాంచ్ చేస్తున్నారు అన‌గానే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సాంగ్ లాంచ్ చేసి, సినిమా కాన్సెప్ట్ గురించి అడిగి తెలుసుకుని, ‘క‌థ‌లో మంచి డెప్త్ ఉంది. ఈ సినిమాను బాగా  ప్రమోట్ చేయండి, త‌ప్పకుండా బిగ్ హిట్ అవుతుంది’ అని  చెప్పి  మా టీమ్ అంద‌ర్నీ విష్ చేసిన ప్రభాస్‌కి హృద‌య‌పూర్వక ధ‌న్యవాదాలు’ అన్నారు. సుశిలాదేవి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సాయికార్తిక్‌ సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

సినిమా

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు