-

ఎంజీఆర్, జయలలిత కాంబినేషన్‌లో 29వ చిత్రం

27 Feb, 2018 02:06 IST|Sakshi

తమిళసినిమా: దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత కలిసి 28 చిత్రాల్లో నటించారు. అవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందినవే. తాజాగా ఆ జంట 29వ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. మరణించిన వారు మళ్లీ నటించడమేంటీ  అనుకుంటున్నారా? అవును.. అత్యం త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  ఎంజీఆర్, జయలలిత జంట గా కిళక్కు ఆఫ్రికావిల్‌ రాజు అనే యానియేషన్‌ చిత్రం  తెరకెక్కుతోంది. ఎంజీఆర్‌ కథానాయకుడిగా 1972లోనే హాంకాంగ్, జపాన్‌ వంటి దేశాల్లో ఉలగం చుట్రుం వాలిభన్‌ అనే బ్రహ్మండ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఎంజీ ఆర్‌ దానికి సీక్వెల్‌గా కిళక్కు ఆఫ్రికావిల్‌ రాజు చిత్రం చేయాలని భావించారు. ఆ తరువాత ఆ యన రాజకీయ రంగప్రవే శం చేయడంతో ఆ చిత్రం తెరకెక్కలేదు. కాగా అదే పేరుతో ఉళగం చుట్రుం వాలిబన్‌ చిత్రానికి సీక్వెల్‌గా అప్పట్లో ఎంజీఆర్‌తో కలిసి పలు చిత్రాలలో నటించిన ఆయన స్నేహితుడు ఐసరి వేలన్‌ కొడు కు ఐసరి గణేశ్‌ వేల్స్‌ ఫి లిం ఇంటర్నేషనల్, ప్రభుదేవా స్టూడియోస్‌ సంస్థలు కలిసి యానిమేషన్‌ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవల ఎంజీఆర్‌ 101వ జయంతి రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ఆయన 102వ జయంతి సందర్భంగా కిళక్కు ఆఫ్రికావిల్‌ రాజు చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.  ఈ చిత్రంలో ఎంజీఆర్‌కు జంటగా జయలలిత నటింపజేస్తున్నట్లు ఆమె జయంతి సందర్భంగా శనివారం చిత్ర యూనిట్‌ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర సృష్టికర్త (దర్శకుడు) అరుణ్‌మూర్తి మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక ప్రయోగంగా నిలిచిపోతుందన్నారు. ప్రేక్షకుల మనసుల్ని గెలుసుకున్న పురట్చి తలైవన్‌ ఎంజీఆర్, పురట్చి తలైవి జయలలితలను మళ్లీ తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇలాంటి యానిమేషన్‌ చిత్రాలను వాల్ట్‌ డిస్నీ లాంటి సంస్థలు రూపొందించడానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని, తాము ఏడాదిలో పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎంజీఆర్‌ చిత్రాల ఫార్ములా ఈ చిత్రంలోనూ ఉంటుందని, అప్పటి కాలానికి తగ్గట్టుగానే చిత్ర కథనాన్ని తయారు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.   

మరిన్ని వార్తలు