3 ఇడియట్స్

26 Aug, 2013 00:53 IST|Sakshi
3 ఇడియట్స్
నందు, సిద్ధు, శ్రీరాజ్ హీరోలుగా వైకుంఠలవ్య దర్శకత్వంలో నాగోతు రమేష్‌బాబు, వెంపాడ శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘3 ఇడియట్స్’. ఇటీవలే ఈ చిత్రం పాటలను రికార్డ్ చేశారు. 
 
 ఆరు పాటలకు నవనీతాచారి అద్భుతమైన స్వరాలిచ్చారని, వచ్చే నెల మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు చెప్పారు. 
 
 దర్శకుడు మాట్లాడుతూ - ‘‘బీటెక్ చదువుతున్న ముగ్గురు యువకులు చదువుని పక్కన పెట్టి, ప్రేమ అనే దారిలోకి వెళితే పర్యవసానం ఎలా ఉంటుంది? అనేది ఈ చిత్రం కథాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, పాటలు: పైడిశెట్టి రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బలగ సుధాకర్‌రావు.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి