‘అమోలి’ వచ్చేసింది...

14 May, 2018 14:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  టాలీవుడ్‌ హీరో​, నాచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్తో దాదాపు  ముప్పయి నిమిషాలు నిడివి గల ‘అమోలి’  డాక్యుమెంటరీ రిలీజ్‌ అయింది. ఎంతో కాలంగా  ఊరిస్తున్న ఈ లఘు చిత్రాన్ని  నాని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అమోలి అనే అమ్మాయి కథ గురించి ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు మధ్యమధ్యలో నాని వాయిస్ ఓవర్‌ ఇచ్చారు. ఈ కథలో అమ్మాయిలు తప్పిపోవడం.. తదనంతర పరిణామాలను చూపించారు. మైనర్‌ బాలికలు, మహిళలపై జరుగుతున్న వేధింపులు, హత్యాచారాలు, అపహరణలు లాంటి ఉదంతాలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ షార్ట్‌ఫిలిం ఎంతటి ఆదరణ  పొందనుందో చూడాలి. 

బెంగాల్‌లోని అందమైన టీ ఎస్టేట్స్‌లో ఆడుకోవాల్సిన అమోలీ ఒకరోజు హఠాత్తుగా మాయమవుతుంది. ఇలా అపహరణకు గురైన ఆడపిల్లలంతా ఏమైపోతున్నారు? ఎలాంటి పరిస్థితులను వాళ్లు ఎదుర్కుంటున్నారు? అనే ప్రశ్నలకు సమాధాన రూపంగా ఈ కథ. ‘‘ఈ కథ మన చుట్టూ ఉన్న ఒక చీకటి నిజానికి సంబంధించింది. ఆ చీకటి ఈ రోజు మన దేశంలోని ప్రతి ఊరినీ.. ప్రతి గ్రామాన్నీ కమ్మేసింది. ఆ అంధకారంలోనే మనమూ బ్రతుకుతున్నాం’’ అంటూ నాని చెప్పే వాయిస్ ఓవర్ ఈ షార్ట్ ఫిలింకు మరింత ప్లస్ అయింది.  కాగా ఈ లఘు చిత్రానికి హిందీలో రాజ్ కుమార్ రావ్ .. ఆంగ్లంలో విద్యాబాలన్ .. తమిళంలో కమల్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, తెలుగులో నాని వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా