పండక్కి సిద్ధం

9 Mar, 2020 05:37 IST|Sakshi
అమృతా అయ్యర్‌, ప్రదీప్‌ మాచిరాజు

యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. అమృతా అయ్యర్‌ కథానాయికగా నటించారు. ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే’ చిత్రాలకు సుకుమార్‌ దగ్గర పనిచేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ చిత్రసీమలో విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమాని ఉగాదికి ఈ నెల 25న విడుదల చేస్తున్నారు.  ఈ సినిమా ఔట్‌పుట్‌ నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి జీఏ2, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.

‘‘రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన చిత్రమిది. ఇందులోని ‘నీలి నీలి ఆకాశం..’, ‘ఇదేరా స్నేహం..’ పాటలు సంగీత ప్రియుల ఆదరణను అమితంగా పొందాయి. మహేశ్‌ బాబు విడుదల చేసిన ‘నీలి నీలి ఆకాశం..’ పాట సెన్సేషనల్‌ హిట్టయి, ఇప్పటికే 60 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. తాజాగా విడుదల చేసిన ‘మీకో దండం..’ పాట 24 గంటల్లో 3 మిలియన్‌కి పైగా వ్యూస్‌ సాధించింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష, ‘హైపర్‌’ ఆది తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: దాశరథి శివేంద్ర.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు