యూత్‌ని ఆకట్టుకునేలా ‘4 లెటర్స్‌’

15 Feb, 2019 14:03 IST|Sakshi

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై   ప్రొడ‌క్షన్ నెం.1గా  ఉద‌య్ కుమార్ దొమ్మరాజు ,  ఆర్‌. ర‌ఘురాజ్  ద‌ర్శక‌త్వంలో ‘4 లెట‌ర్స్’ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుద‌ల‌కు సిద్దమైంది. ఈ  సంద‌ర్భంగా హీరో ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు...

 • గ‌తేడాది  వైజాగ్ స‌త్యానంద్ గారి వ‌ద్ద మూడు నెల‌ల పాటు  యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాను. వారి ద‌గ్గరే సినిమా గురించి, యాక్టర్‌కి కావాల్సిన డిసిప్లేన్‌, డెడికేషన్ తో పాటు  యాక్టర్ చేయాల్సిన హార్డ్ వ‌ర్క్ గురించి తెలుసుకున్నాను. అలాగే యుఎస్ లో ఉన్నప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ అనుభ‌వం ఈ సినిమాకు చాలా హెల్పయింది. 
   
 • నా గ్రాడ్యుయేష‌న్  కంప్లీట్ అయ్యాక... ఇండియా కెళ్లి నా సినిమా ట్రైల్స్ నేను చేసుకుంటాను అని మా ఫ్యామిలీతో చెప్పాను. మా ఫ్యామిలీ కి కూడా సినిమాలంటే చాలా ఇంట్రస్ట్ ఉండ‌టంతో ఓకే అన్నారు. స‌రే ఎవ‌రో ఎందుకు మ‌న‌మే ఒక బేన‌ర్ పెట్టి సినిమా చేద్దాం అని ఈ సినిమా చేశారు.
   
 • ర‌ఘురాజ్ గారు ఫుల్ స్క్రిప్ట్, లొకేష‌న్స్, షెడ్యూల్స్ తో స‌హా వ‌చ్చి క‌లిసారు. ఫ‌స్ట్ సిటింగ్ లో వారి క్లారిటీ అంద‌రికీ న‌చ్చడంతో ఓకే చేశాం. అందులో తెలుగు, త‌మిళ‌, క‌న్నడ భాష‌ల్లో ప‌ది సినిమాల‌కు పైగా చేశారు. అంత ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న ద‌ర్శకుడితో సినిమా చేస్తే బావుంటుంద‌నిపించింది. నేను ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పానన్నా, మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇవ్వగ‌లిగానన్నా ర‌ఘురాజే గారే కార‌ణం.
   
 • కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే క‌థ ఇది. ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది. ఏంటి? అన్న క‌థాంశానికి ల‌వ్‌, ఎంట‌ర్ టైన్ మెంట్ మిక్స్ చేసి ‘4లెట‌ర్స్’ సినిమాను తెర‌కెక్కించారు. స్టూడెంట్స్ త‌ల‌చుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌రు అనే సందేశంతో సినిమా రూపొందింది. యూత్‌ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌కు న‌చ్చే విధంగా సినిమా ఉంటుంది. క్లైమాక్స్ లో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.
   
 • చాలా కంఫ‌ర్ట్ గా అనిపించింది. ఇంట్లోనే నాన్న‌, బాబాయి అన్నట్టు ఉండేవాళ్లం. సెట్స్ మీద‌కు వెళితే... చాలా ఫ్రొఫెష‌న‌ల్ గా ఉండేవాళ్లం. మా ఫాద‌రే ప్రొడ్యూస‌ర్ కావ‌డంతో ఫ‌స్ట్ నుంచి  ప్రొడ‌క్షన్ గురించి తెలుసుకునే అవ‌కాశం క‌లిగింది. ప్రతీది ప్లానింగ్ ప్రకారం వెళ్లడంతో ఎక్కడ మ‌నీ వేస్ట్ కాకుండా అనుకున్న టైమ్ కు సినిమా తీయ‌గ‌లిగాం.
   
 • బెంగాల్ టైగ‌ర్, పేప‌ర్ బాయ్, గ‌రుడవేగ (డియో డియో) చిత్రాల‌కు ప‌ని చేసిన భీమ్స్ గారు మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. అలాగే ఆర్ ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. అలాగే సినిమాటోగ్రఫీ, గ‌ణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్షన్‌. 
   
 • విక్టరీ వెంక‌టేష్ గారికి ట్రైల‌ర్ చూపించాం. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా  అడ్వైజెస్ కూడా  ఇచ్చారు. మాట్లాడిన కొద్దిసేపైనా ఒక యాక్టింగ్ క్లాస్ లా అనిపించింది. ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నాం. కొంచెం టెన్షన్ అయితే ఉంది. హిట్టయితే నాన్నకు నేనిచ్చే రిట‌న్  గిఫ్ట్ ఈ సినిమా అవుతుంది.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు