-

‘జై భారతి. వందే భారతి’

16 Aug, 2014 00:25 IST|Sakshi
‘జై భారతి. వందే భారతి’

ఇదొక నిరంతర పరిణామం
స్వాతంత్య్ర దినోత్సవంపై బాలీవుడ్
 
న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ అమితాబ్ సహా బాలీవుడ్ ప్రముఖులు జాతిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాత శేఖర్‌కపూర్ మాట్లాడుతూ సంవత్సరంలో ఏదో ఒక్కరోజును కాకుండా కచ్చితంగా ప్రతిరోజునూ స్వాతంత్య్రదినోత్సవంగా పరిగణించాలన్నాడు. ‘ఇదొక సంఘటన కాదు. ఇదొక నిరంతర పరిణామం. ఒక దేశం ఎప్పటికీ స్వతంత్రం కాబోదు. అందులోని ప్రజలకు మాత్రమే స్వతంత్రం లభిస్తుంది’ అని అన్నాడు. నటి ప్రీతి జింతా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ‘స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’అని అమితాబ్ ట్వీట్ చేశాడు. ‘జై భారతి. వందే భారతి’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు.
 
‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. జైహో’ అని నటదర్శకురాలు ఫర్హాన్‌ఖాన్ పేర్కొన్నారు. నిర్మాత మాధుర్ భండార్కర్ మాట్లాడుతూ దేశంలో శాంతిసౌభ్రాతృత్వాలు పరిఢవించాలంటూ అభిలషించారు. వందేమాతరం అని పేర్కొన్నారు. గాయని ఆశా భోస్లే ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. నటి అనుష్కశర్మ దేశసేవలో తరిస్తున్న జవానులనుఅభినందించారు.
 
సహభారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వేషం, భయాలను వంటి వాటినుంచి ఇకనైనా స్వాతంత్రం పొందాలంటూ సంగీత దర్శకుడు విశాల్ డఢ్లాని దేశప్రజలకు సూచించారు. అదే నిజమైన స్వాతంత్య్రమంటూ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ మనసులను కూడా స్వేచ్ఛగా ఉంచుకోవాలన్నారు. ఇంకా సుజయ్‌ఘోష్, ఆనంద్‌రాయ్, దియామీర్జా, వీర్‌దాస్, షాహిద్‌కపూర్, సంగీత దర్శకుడు శేఖర్ రవిజైని తమ తమ అభిమానులకు 68వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.