నవ్వులు పంచే 90 ఎం.ఎల్‌

11 Nov, 2019 03:16 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎం.ఎల్‌’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించారు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్‌ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్‌ రైట్స్‌ని శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సొంతం చేసుకుంది.  అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ– ‘‘90.ఎంఎల్‌’ టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో వాణిజ్య అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇటీవల అజర్‌బైజాన్‌లో మూడు పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి’’ అన్నారు. ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ లో కార్తికేయను చూడగానే ‘90 ఎంఎల్‌’ కథకి కరెక్టుగా సరిపోతాడనిపించింది. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా కార్తికేయకు ఈ పాత్ర కరెక్టుగా సరిపోయిందని అంటారు. యూత్‌ఫుల్‌గా సాగే సినిమా ఇది. అజర్‌బైజాన్‌లో చిత్రీకరించిన మూడు పాటలు సినిమాకు హైలైట్‌ అవుతాయి. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది’’ అన్నారు శేఖర్‌ రెడ్డి ఎర్ర. రవికిషన్, రావు రమేష్, అజయ్, ఆలీ, ప్రగతి, ప్రవీణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు