ఇది యూత్‌ కోసమే

21 Apr, 2019 00:17 IST|Sakshi
ఓవియా

ఐదుగురమ్మాయిలు తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్‌’ ‘ఇది చాలా తక్కువ’ అనేది క్యాప్షన్‌. ఓవియా ప్రధాన పాత్రలో నటించారు. హీరో శింబు గెస్ట్‌ రోల్‌ చేసి, సంగీతం అందించారు. అనితా ఉదీప్‌ దర్శకత్వం వహించారు. కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై యిన్నం శ్రీనివాసరావు సమర్పణలో కృష్ణ కాకర్లమూడి నిర్మాణ సారథ్యంలో పఠాన్‌ చాంద్‌బాషా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ హైదరాబాద్‌లో జరిగింది.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, సురేశ్‌ కొండేటి సీడీను ఆవిష్కరించి మాట్లాడుతూ – ‘‘యూత్‌ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన చిత్రం ఇది. పాటలు, ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఈ నెల 26న చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు పఠాన్‌ చంద్‌. ఈ వేడుకలో విజయరంగరాజు, మల్లికార్జున్, రంగనాయకులు, కరుణాకర్‌ రాము తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు