ఇద్దరు భామల కనువిందు

26 Sep, 2017 05:19 IST|Sakshi

తమిళసినిమా: ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే చిత్రంలో నటిస్తే, అదీ తమ అందాలతో కుర్రకారును కనువిందు చేయడానికి ఎంతదాక అయినా వెళ్లడానికి రెడీ అనే బ్యూటీస్‌ అయితే ఆ చిత్రం కచ్చితంగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక సుందర్‌.సీ వంటి వినోదాన్ని పండించే దర్శకుడు ఆ చిత్రాన్ని మలిస్తే ఇక ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్‌టెయిన్‌మెంట్‌కు కొదవే ఉండదు. కరెక్ట్‌గా అలాంటి చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఇంతకు ముందు సుందర్‌.సీ దర్శకత్వం వహించిన కలగలప్పు చిత్రం కోలీవుడ్‌ తెరపై మంచి సందడి చేసింది. అంతే కాదు అంతకు ముందు మార్కెట్‌ డల్‌ అయిన నటులు విమల్, శివ, నటీమణులు అంజలి, ఓవియలకు విజయోత్సాహాన్నిచ్చిన చిత్రం అది. కాగా ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు సుందర్‌.సీ సిద్ధం అయ్యారు. అయితే ఈ సారి మరింత పెద్ద కాస్టింగ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

విమల్, శివలకు బదులు ఇందులో జీవా, జైలను హీరోలుగా ఎంచుకున్నారు. ఇక ఓవియ, అంజలి స్థానంలో అందాల భామలు  నిక్కీగల్రాణి, క్యాథరిన్‌ ట్రెసాలను ఎంపిక చేసుకున్నట్లు తాజా సమాచారం. ఈ కలగప్పు–2 చిత్రాన్ని సుందర్‌.సీ అక్టోబరులో ప్రారంభించనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక పూర్వకంగా వెల్లడించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు