హారర్ నేపథ్యంలో కుటుంబ కథ

4 Dec, 2014 22:46 IST|Sakshi
హారర్ నేపథ్యంలో కుటుంబ కథ

హన్సిక ముఖ్య పాత్రధారిణిగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘అరన్మణి’. ఈ చిత్రం ‘చంద్రకళ’ పేరుతో ఈ నెల 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.  శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు ఈ అనువాద చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా గురించి సమర్పకుడు సి.కల్యాణ్ చెబుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే కుటుంబ కథాచిత్రమిది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. తమిళంలో 30 కోట్లు వసూలు చేసి సంచలన విజయంగా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. లక్ష్మీ రాయ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్, మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, సంగీతం: కార్తీక్‌రాజా, భరద్వాజ్, సహనిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి.
 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా