అభిమానులకు మహేశ్‌బాబు థాంక్స్

20 Jun, 2016 11:24 IST|Sakshi
అభిమానులకు మహేశ్‌బాబు థాంక్స్

ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చినందుకు సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పాడు. ముందుగా శ్రీమంతుడు సినిమాలో నటనకు అవార్డు ఇచ్చినందుకు ఫిలింఫేర్‌కు థాంక్స్ చెప్పిన ప్రిన్స్, ఆ తర్వాత మరో ట్వీట్‌లో దీన్ని సాధ్యం చేసినందుకు అభిమానులకు పెద్ద థాంక్యూ అని చెప్పాడు.

అయితే అవార్డుల కార్యక్రమానికి రాలేకపోయానన్నాడు. ఫిలింఫేర్ అవార్డులలో మహేశ్‌ బాబుకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. శ్రుతిహాసన్, మహేశ్ జంటగా నటించిన శ్రీమంతుడు మూవీ పలు అవార్డులతో పాటు కలెక్షన్లను కూడా కొల్లగొట్టింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.