ఆడా, మగ ఫ్రెండ్స్‌గా ఉండకూడదా..?: నటి

6 Apr, 2017 09:15 IST|Sakshi
ఆడా, మగ ఫ్రెండ్స్‌గా ఉండకూడదా..?: నటి

ముంబై: సినీ ఇండస్ట్రీలో ఒకరితో కాస్త చనువుగా ఉంటే చాలు డేటింగ్, ప్రేమ అంటూ ఏదో లింకులు పెడతారని మోడల్, టాలీవుడ్ నటి జాస్మిన్ భాషిన్ అంటోంది. కో స్టార్ సిద్ధార్థ శుక్లాతో నటి కొంతకాలం నుంచి డేటింగ్ చేస్తోందన్న వార్తలు గుప్పుమనడంతో ఆమె తీవ్రంగా స్పందించింది. ఆడా, మగ సరదాగా మాట్లాడం కూడా తప్పేనా.. అలా కనిపించడమే పొరపాటు.. వారి మధ్య ఏదో రిలేషన్ ఉందని ప్రచారం చేస్తారని ఈ భామ మండిపడుతోంది. సిద్ధార్థ శుక్లాతో తనకు ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. సిద్ధార్థ లాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని అందరూ కోరుకుంటారు.. ఎందుకంటే అతడు చాలా కూల్‌గా ఉంటాడని చెప్పింది.

''దిల్ సే దిల్ తక్'లో ఇద్దరం కలిసి నటించాం. అతడు ఎప్పుడు జోకులేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. ఎంతో సరదాగా ఉండే అతడిని నేను తపోరి అని పిలుస్తుంటాను. ఆడా, మగవారు స్నేహితులుగా ఉండటం కూడా తప్పేనా. సిద్ధార్థ నాకు బెస్ట్ ఫ్రెండ్. సమయం దొరికినప్పుడు ఫ్రెండ్స్‌తో సమయాన్ని గడపడాలన్నది నా అభిప్రాయం. కెరీర్ మీద దృష్టిపెట్టిన నాకు ప్రేమలో పడే తీరిక లేదు' అని తనపై వచ్చిన వదంతులకు బదులిచ్చింది. హీరో సాయిరామ్ శంకర్ మూవీ 'దిల్లున్నోడు'తో టాలీవుడ్‌కు పరిచయమైన జాస్మిన్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీలు, టీవీ షోలతో బిజీగా ఉంది.