‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’లా...

4 May, 2017 23:14 IST|Sakshi
‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’లా...

రిషి, సోనియామాన్‌ జంటగా శ్రీ వెంకటేశ్వర సూపర్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఆకుల వెంకటేష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘డాక్టర్‌ చక్రవర్తి’. శేఖర్‌ సూరి దర్శకుడు. విజయ్‌ కురాకుల సంగీత దర్శకుడు. ఈ చిత్రం మే ద్వితీయార్ధంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘శేఖర్‌ సూరి ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ని అద్యంతం ఉత్కంఠ కలిగేలా తీశారు. ఆ సినిమాలానే ఈ ‘డాక్టర్‌ చక్రవర్తి’ కూడా స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నిర్మాత వెంకటేష్‌ సహకారం మాటల్లో చెప్పలేనిది. విజయ్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు చిత్రదర్శకుడు శేఖర్‌ సూరి. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: తిరుపతిరెడ్డి, కెమెరా: రాజేందర్‌.