ఇక ‘గీతాంజలి’కి సీక్వెల్

18 Dec, 2014 04:11 IST|Sakshi
ఇక ‘గీతాంజలి’కి సీక్వెల్

 అంజలి కథానాయికగా రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన హారర్, కామెడీ చిత్రం ‘గీతాంజలి’కి సీక్వెల్ రానుంది. రాజ కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని  చినబాబు  నిర్మించనున్నారు.త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి చినబాబు మాట్లాడుతూ -‘‘రాజ కిరణ్ ప్రతిభ గల దర్శకుడు. ఈ మధ్యకాలంలో ‘గీతాంజలి’ నాకు బాగా నచ్చిన సినిమా. అందుకని ఆయన దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ నిర్మించాలనుకున్నాను. వర్కింగ్ టైటిల్‌గా ‘సీక్వెల్ ఆఫ్ గీతాంజలి’ అని పెట్టాం. ఓ ప్రముఖ కథానాయిక నటించనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ కథానాయకుడు నటిస్తారు’’ అన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా