అతడే సీఎమ్ అయితే?

12 Jun, 2014 00:49 IST|Sakshi
అతడే సీఎమ్ అయితే?

 ఆ నలుగురు, వినాయకుడు చిత్రాల ద్వారా ఉత్తమాభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రేమ్‌కుమార్ పట్రా. ఆయన సమర్ఫణలో అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వంలో సరితా పట్రా నిర్మించిన చిత్రం ‘ఆ ఐదుగురు’. వెంకట్, అస్మితా సూద్, క్రాంతి, క్రాంతికుమార్, తనిష్క్‌రెడ్డి, కృష్ణతేజ, శశి ఇందులో ముఖ్య తారలు. ‘మంత్ర‘ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఆడియో వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, లగడపాటి శ్రీధర్, డీయస్ రావు, శ్రీధర్ రెడ్డి తదితరులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 
 తన తండ్రి చనిపోవడం వల్ల ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగిందని, ఈ నెల 20న లేక 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ పట్రా తెలిపారు. ఇందులో ఐపీయస్ అధికారి తోట చక్రవర్తిగా  నటించానని, ఈ పాత్ర కోసం రెండు నెలలు పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నానని వెంకట్ చెప్పారు. ఈ కథ ప్రధానంగా ఐదు పాత్రలు చుట్టూ తిరుగుతుందని, ఆదర్శ భావాలున్న ఓ యువకుడు ముఖ్య మంత్రి అయితే ఏం చేస్తాడనేది ముఖ్య అంశమని దర్శకుడు అన్నారు. పాటలు రాయడంతో పాటు ఈ సినిమాకి మాటలు కూడా రాశానని, ఇది ప్రయోజనాత్మక సినిమా అని సుద్దాల అశోక్‌తేజ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్‌కుమార్ పట్రా.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి