హిందీలో దుమ్మురేపుతున్న త్రివిక్రమ్ సినిమా

29 Aug, 2018 19:59 IST|Sakshi

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరో నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం 'అ ఆ'. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై నితిన్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. అవునండి తెలుగులో హిట్‌ అయిన ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూట్యూబ్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఆగస్టు 26న 'అ ఆ' చిత్ర హిందీ వర్షన్‌ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. మూడు రోజుల్లోపే ఈ చిత్రం 20 మిలియన్ల వ్యూస్ చేరుకుని రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో వేగంగా 10 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది.

హీరో నితిన్ అయినా.. సినిమా ఎక్కువగా సమంత పాత్ర చూట్టూనే తిరుగుతుంది. అందుకు తగ్గట్టుగా సమంత కూడా అనసూయ పాత్రలో ఒదిగిపోయింది. సెంటిమెంట్, కామెడీ, అమాయకత్వం, పొగరు ఇలా అన్ని రకాల వేరియేషన్స్‌ను బాగా చూపించింది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ సమంత ఆకట్టుకుంది. చిత్రంలో చూపించిన పల్లె వాతావరణం, అందుకు తగ్గట్టుగా మిక్కి జె మేయర్ స్వరపరిచిన బాణీలు ఉత్తరాది సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలకు యూట్యూబ్ లో ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. హిందీలో డబ్ అయిన అల్లు అర్జున్ నటించిన సరైనోడు, దువ్వాడ జగన్నాథం చిత్రాలు ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉన్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా